కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి కిడ్నాప్‌ కలకలం రేగింది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల కు చెందిన   జోతిష్యుడు దుర్గారావును 8మంది సభ్యులు గల ఓ ముఠా కిడ్నాప్ చేసింది.

 కిడ్నాప్‌ చేసి రూ.15లక్షలు  డబ్బులు ఇవ్వాలంటూ జోతిష్యుడి కుటుంబసభ్యులను డిమాండ్‌ చేశారు. కాగా.. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జగిత్యాల పోలీసులు.. అన్ని చెక్ పోస్టులకు సమాచారం అందజేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో పోలీసులను కూడా అలర్ట్ చేయగా.. ఇబ్రహీంపట్నం పోలీసులకు కిడ్నాప్ ముఠా దొరికింది. జోతిష్యుడు దుర్గారావుని కారులో కూర్చొని తీసుకొని వెళ్తున్నట్లుగా గుర్తించారు. 

జోతిష్యుడు దుర్గారావును రక్షించి.. కిడ్నాపర్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుొని దర్యాప్తు చేస్తున్నారు.