Asianet News TeluguAsianet News Telugu

నువ్వు-నేను ఒకే గదిలో ఉందాం.. దమ్ముంటే ఆ పని చేయి.... జేసీకి కేతిరెడ్డి సవాల్...

జేసీ ప్రభాకర్ రెడ్డి అనవసరంగా రెచ్చగొడుతున్నాడని.. కాలు కదపలేని స్థితిలో ఉన్న ఆయన తననెలా చంపుతాడంటూ ఎద్దేవా చేశారు కేతిరెడ్డి. 

Kethireddy pedda reddy strong warning to JC prabhakar reddy - bsb
Author
First Published Aug 28, 2023, 4:23 PM IST

అనంతపురం : తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి టిడిపి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపు హాస్యాస్పదం అంటూ ఎద్దేవా చేస్తూ.. ‘ఒక రోజంతా మనిద్దరం ఒకే గదిలో ఉందాం… దమ్ముంటే నన్ను చంపుతావా?..’ అంటూ సవాల్ విసిరారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి, టిడిపి మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది.  

కేతిరెడ్డి పెద్దారెడ్డిని చంపేస్తానంటూ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేతిరెడ్డి ఈ మేరకు వ్యంగ్యాస్త్రాలు విసిరారు.. ఆయన సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతిరోజు ప్రభాకర్ రెడ్డి నన్ను చంపేస్తానంటూ అరుస్తున్నారు. రోజంతా టైం ఇస్తాను. నువ్వు-నేను ఒకే గదిలో ఉందాం. నన్ను చంపుతావా?... అని ప్రశ్నించారు.  

సీఎం జగన్‌ చొరవ.. శాంతితో చేతులు కలిపేందుకు మంత్రి రోజా అయిష్టత.. అసలేం జరిగిందంటే..

అడుగుతీసి అడిగేయలేని స్థితిలో ఉన్న ప్రభాకర్ రెడ్డి ఇలా చంపుతానని బెదిరింపులకు పాల్పడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీంతో పాటు తాడిపత్రిలో టిడిపి పరిస్థితి మీద సెటైర్లు వేశారు. తాడిపత్రి టీడీపీ ఇంచార్జ్  జెసి అస్మిత్ రెడ్డి  వీకెండ్ పొలిటిషన్ అన్నారు. అక్కడ టిడిపి లీడర్ ఎవరో అర్థం కాక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని చెప్పుకొచ్చారు.  

దీంతో ఉనికి కోసమే ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో హడావుడి చేస్తున్నారని చెప్పారు. గద్వాలలో దొంగతనాలు చేసి జెసి ప్రభాకర్ రెడ్డి కుటుంబం తాడిపత్రికి వలస వచ్చారు. చత్తీస్గడ్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారం ఉంది. ఆయా రాష్ట్రాల్లో కూడా త్వరలోనే కేసులు వేస్తాం. 

బిఎస్ 3 వాహనాలను స్క్రాప్ కింద కొని, నాగాలాండ్ లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన నీచ చరిత్ర జేసీ ప్రభాకర్ రెడ్డిది. నన్ను పదేపదే రెచ్చగొట్టి, ఆ సానుభూతితో కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకుందామనుకుంటున్నాడు.  జెసిబ్రదర్స్ కు చిత్తశుద్ధి ఉంటే త్రిశూల్ సిమెంట్ వ్యవహారంలో ప్రభుత్వం విధించిన రూ. 100 కోట్ల జరిమానాను చెల్లించాలంటూ సవాల్ విసిరారు.

Follow Us:
Download App:
  • android
  • ios