అమరావతి: విజయవాడ తెలుగుదేశం పార్టీ నేతలు కేశినేని నానికి, బుద్దా వెంకన్నకు మధ్య రగులుతున్న వివాదం సద్దుమణగడం లేదు. పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. 

తాను బాలయోగి ఆస్తులు కాజేశానని ఓ ప్రబుద్ధుడు చెప్పాడని, అది వాస్తవేమనని విజయవాడ తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అన్నారు. ట్విట్టర్ వేదికగా కేశినేని నాని బుద్ధా వెంకన్న చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. 

అయితే నీతి, నిజాయితీ, విలువలు, సిద్ధాంతాలు బాలయోగి ఆస్తులని వాటిని తాను కాజేసినందుకు గర్వపడుతున్నానని నాని అన్నారు.
 బాలయోగికి ఉన్న ఆస్తులు నీతి, నిజాయితీ, విలువలు, సిద్ధాంతాలు, ప్రజల్ల పట్ల అంకితభావం, ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి. వీటిని కాజేసి పాటిస్తునందుకు చాలా గర్వ పడుతున్నానని ఆయన అన్నారు. 

ట్వీట్ల వివాదాన్ని ఆపాలని టీడీపీ అధిష్టానం ఆదేశించినప్పటికీ ఇంకా వారిద్దరు స్వస్తి చెప్పడం లేదు. విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఇదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.