తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని కుటుంబంలో విబేధాలు రచ్చకెక్కాయి. తన సోదరుడుక కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే కేశినేని చిన్ని మీడియా ముందుకు వచ్చారు. టీడీపీలో తానొక సాధారణ కార్యకర్త అని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని కుటుంబంలో విబేధాలు రచ్చకెక్కాయి. తన సోదరుడుక కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే కేశినేని చిన్ని మీడియా ముందుకు వచ్చారు. టీడీపీలో తానొక సాధారణ కార్యకర్త అని చెప్పారు. వాహనానికి ఎంపీ స్టిక్కర్ లేదని తెలిపారు. హైదరాబాద్ పోలీసులు కారు తీసుకెళ్లి ఎంక్వైరీ చేశారని.. తర్వాత వాహనాన్ని తిరిగి తన వద్దకు పంపారని చెప్పారు. ఈ కేసుతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
తమ సోదరుడల మధ్య ఆస్తి విబేధాలు లేవని కేశినేని చిన్ని చెప్పారు. కేశినేని నానితో తాను ఎక్కడ విబేధించలేదని తెలిపారు. తనను విజయవాడ నుంచి పోటీ చేయమని ఎవరూ అడగలేదని చెప్పారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని అన్నారు. చంద్రబాబు ఏది చెబితే అది చేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు.
ఇది కుటుంబ సమస్య అని కేశినేని చిన్ని అన్నారు. స్టిక్కర్ విషయం తననే అడిగితే సరిపోయేది కదా అని అన్నారు. వివాదాన్ని సృష్టించిన ఆయనతో తాను ఏం మాట్లాడగలను? అని కామెంట్ చేశారు. ఇది చాలా చిన్న విషయమని.. దీనిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఈ వివాదంలో తన భార్యను కూడా లాగడం బాధకరమని చెప్పారు.
ఇన్నాళ్లుగా లేనిది గత రెండు నెలల నుంచే ఆరోపణలు ఎందుకని ప్రశ్నించారు. నిన్న ఉదయమే నాకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉంటాయని అన్నారు. తాను వ్యాపారులెవరిని బెదిరించలేదని చెప్పారు. తాను వ్యాపారులను ఎవరిని కలిశానో నిరూపించాలని సవాలు విసిరారు.
అసలేం జరిగిందంటే..
తన పేరు, హోదాను ఉపయోగించి గుర్తుతెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ ఎంపీగా తాను వినియోగించే వీఐపీ వాహనం స్టిక్కర్ నకిలీది రూపొందించి.. దానితో విజయవాడ, హైదరాబాద్‌లలో తిరుగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలా వాడుతున్న వాహనం నెంబర్ టీఎస్ 07 హెచ్ 7777గా పేర్కొన్నారు. కేశినేని నాని ఫిర్యాదు చేసిన రెండు వారాల తర్వాత.. జూన్ 9వ తేదీన ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
అయితే కేశినేని నాని ఫిర్యాదులో పేర్కొన్న వాహనం.. తన సోదురుడు చిన్న భార్య జానకి లక్ష్మి పేరు ఉంది. దీంతో సొంత సోదరుడి కుటుంబంపైనే కేశినేని నాని ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక, గత కొంతకాలంగా కేశినేని కుటుంబలో రాజకీయ చిచ్చు కొనసాగుతున్నట్టుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
