ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా అభివర్ణించే కేరళలో వరద భీభత్సం చూస్తుంటే హృదయం కలచివేస్తోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
విశాఖపట్టణం: ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా అభివర్ణించే కేరళలో వరద భీభత్సం చూస్తుంటే హృదయం కలచివేస్తోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
భారీ వరదలు ఎడతెరపని వర్షాలతో చిన్నాభిన్నమైన కేరళ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్ట కాలంలో తనప్రార్థనలు, ఆలోచనలు కేరళ ప్రజల వెన్నంటే ఉంటాయన్నారు. విపత్తుతో తల్లడిల్లుతున్న కేరళ ప్రజలకు సహాయ, పునరావాస చర్యల్లో కేంద్రప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరారు.
