కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సం ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ ని ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా సోమవారం విజయవాడ వెళ్లారు. అయితే... ఈ సమయంలో... ప్రకాశం బ్యారేజీ వద్ద కేసీఆర్ కొంత సమయం ఆగారు.

తొలుత గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు నుండి నేరుగా ఇంద్రకిలాద్రికి చేరుకుని దుర్గమ్మను దర్శించుకున్నారు. అటు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ నివాసానికి కేసీఆర్ వెళ్లారు. అయితే మార్గం మధ్యలో ప్రకాశం బ్యారేజీ వద్ద కేసీఆర్‌ తన కారును ఆపారు. కిందకు దిగి.. బ్యారేజీనీ, నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించారు. అనంతరం కారులో జగన్ నివాసానికి బయలుదేరారు.