ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది అని, తన స్వార్థం కోసం ఏ పార్టీతో అయినా జతకడతాడని వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. అధికారం కోసం నిన్నటి వరకు బీజేపీతో పొత్తు పెట్టుకొని.. ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలిపింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలని చూసింది చంద్రబాబేనని ఆయన అన్నారు.  కూకట్ పల్లిలో లోధియా అపార్ట్ మెంట్ లో మంత్రి లోకేష్ చేసిన అక్రమాల వ్యవహారాల వీడియోలను త్వరలో కేసీఆర్ బయటపెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. బహుశా చంద్రబాబుకి కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ఇదే అయ్యి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్.. కేసీఆర్ తో భేటీ అయ్యారని చెప్పారు.