విశాఖలో నా స్థలమే కబ్జా చేశారు, గన్ ఎక్కుపెట్టి సెటిల్మెంట్లు: కన్నా

విశాఖపట్నంలో తన స్థలాన్నే కబ్జా చేశారని బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. అది తనదని తెలియడంతో వదిలేశారని చెప్పారు. వైజాగ్ లో గన్ను గురిపెట్టి భూ సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆయన అన్నారు.

Kanna Laxminarayana alleges land grabbings taking palce in Vizag

విశాఖపట్నం: వైజాగ్ లో తన స్థలాన్నే కబ్జా చేశారని, ఆ స్థలం తనదని తెలియడంతో వదిలేశారని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. గన్ గురిపెట్టి భూకబ్జాలు చేస్తున్నారని ఆయన అన్నారు. భూకబ్జాల విషయంలో వైజాగ్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని ఆయన అన్నారు. వైజాగ్ లోని బిమిలీ వద్ద తమ పార్టీ కార్యాలయం పక్కనే ఉన్న భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారని, ఓ పోలీసు అధికారి అప్రమత్తం చేయడంతో వదిలేశారని ఆయన అన్నారు. 

తన స్థలానికి ప్రహరీ గోడ నిర్మించుకున్నామని, అయితే హుదుద్ తుఫాను కొట్టుకుపోయిందని, భాకబ్జాదారులు దాని చుట్టూ ఫెన్సింగ్ వేశారని, తాను వెళ్లి తీయిస్తుంటే వచ్చి ఈ స్థలం మీదని తెలియదని చెప్పారని కన్నా వివరించారు. గన్ గురిపెట్ిట సిటెల్మెంట్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైజాగ్ లో భూయజమానులు వణికిపోతున్నారని, ప్రజలను అడిగితే భూఆక్రమణలకు సంబంధించి వందలు చెబుతారని ఆయన అన్నారు.

2014 లో రాష్ట్రం విభజన తర్వాత చంద్రబాబు తన అనుభవం తో రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పాడని ఆయన శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. 1999 లో బీజేపీ ని మోసం చేసి బాబు మారిపోయాడని నమ్మడం వల్లనే బాబుతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ప్రజలు కూడా మమ్మల్ని నమ్మా రు 
కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యధావిధిగా పాలన సాగించారని ఆయన చెప్పారు. 

కేంద్రం నుండి నిధులు వస్తున్నా కూడా చంద్రబాబు వర్థ్యం చేశారని ఆయన చెప్పారు. గతంలో కేంద్రం చంద్రబాబుకు చేసిన సూచనలను చంద్రబాబు పేడచెవిని పెట్టారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజన్న పాలన తీసుకొస్తామని చెప్పి, మద్యం నిలిపివేస్తానని నవరత్నాలని తీసుకురావటం వల్ల, చంద్రబాబు పాలనతో విసిగిపోవటం వల్ల ప్రజలు అధిక మెజారిటీ తో వైస్సార్ పార్టీని గెలిపించారని కన్నా చెప్పారు.

అధికారంలో కి వచ్చినా తరువాత జగన్మోహన్ రెడ్డి ఆగడాలకు అడ్డులేకుండా పోయిందని ఆయన విమర్శించారు. మంచి రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పాడని,  అధికారం లోకి వచ్చినప్పటి నుండి అది కనిపించలేదని ఆయన అన్నారు. ఇప్పుడు 9 నెలల పాలన చూసిన తరువాత జగన్మోహన్ రెడ్డి పలుగూపారతో తన గొయ్యి తానే తీసుకుంటున్నాడని ఆయన అన్నారు.

మద్యం నిలిపివేస్తాను అన్నాడు కానీ ప్రభుత్వ షాపులలో రేట్లు విపరీతంగా ఉన్నాయని, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని,  సామాన్యులు ఇసుక దొరకక చాలా ఇబ్బంది పడ్డారని ఆయన అన్నారు. సెప్టెంబర్ 4 న ఇసుక కొత్త పాలసీ తీసుకొస్తాను అని చెప్పి 58 లక్షల భవన నిర్మాణ కార్మికుల పొట్టన కొట్టాడని కన్నా వ్యాఖ్యానించారు. 

ఆర్టీసీ చార్జీలు విపరీతంగా పెంచారని, కనపడకుండా ప్రజల దగ్గర నుండి డబ్బు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఒకపక్క అమ్మ ఒడి అని చెప్తున్నాడు ఇంకోపక్క ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అని చెప్పి వాళ్ళ సొమ్ముతో నే చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది అంటే చిన్నపిల్లలకు చాక్లెట్ ఆశ చూపి నెక్లేస్ దోచుకునే రకం గా ఉందని ఆయన అన్నారు. ఇంతటి రౌడి పాలన ,దౌర్జన్య పాలనను తాను ఇంత వరకూచుడలేదని ఆయన అన్నారు. 

వైఎస్ జగన్ కు ఇగో , శాడిజాలు మాత్రమే కాకుండా ఫ్యాక్షనిజం కూడా ఉందని, ప్రతిపక్షాలో ఉన్న వాళ్ళని కనీసం ఎన్నికలకి నామినేషన్ కూడా వేయనివ్వడం లేదని ఆయన అన్నారు. మనం ఆటవిక రాజ్యంలో ఉన్నామా లేక ప్రజాస్వామ్యం లో ఉన్నామా  అని ఆయన ప్రశ్నించారు. 

నిన్ననే కేంద్ర హోం శాఖ మంత్రికి, తమ పార్టీ దృష్టి కి తీసుకుని వెళ్లామని, ఎన్నికల కమిషనర్ పరిధి లో ఉండవలసిన అన్ని మన ముఖ్యమంత్రి పరిధి లో ఉన్నాయని ఆయన అన్నారు. ఈ ఎన్నికలు పూర్తిగా రద్దు చేసి కేంద్ర ఎన్నికల కమిషన్ ద్వారా, పోలీసు బందోబస్తుతో ఎన్నికలు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జనసేన, బీజేపీ ,కలిసి పోటీ చేస్తున్నట్టు కన్నా తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios