బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ పై సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ ని ఆంబోతు అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు కన్నా.. తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

అవినీతిని ప్రశ్నిస్తే ఎందుకలా ఉలిక్కి పడుతున్నావ్ ‘‘ స్టికర్ సీఎం’’ అంటూ చంద్రబాబుని ఉద్దేశించి ప్రశ్నించారు. బంధాలు, కుటుంబ వ్యవస్థ అంటే మీలాగా దోచిపెట్టాలా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సన్ రైజ్ స్టేట్ గా మారుస్తా అని చెప్పి...   నీ కొడుకును మాత్రమే రైజ్ చేశావ్ అని మండిపడ్డారు.

అవినీతి అచ్చేవేసి ఆంబోతులాంటి కొడుకు ని రాష్ట్రం మీదకు వదిలావంటూ.. చంద్రబాబు, లోకేష్ లను ఉద్దేశించి కన్నా చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

మరో ట్వీట్ లో..‘‘ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజా జీవితానికి, వ్యక్తిగత జీవితానికి ముడి పెట్టి మాట్లాడి మీరు మరింత దిగజారిపోయారు. కుటుంబం కంటే దేశం ముఖ్యమని కుటుంబాన్ని వదిలొచ్చిన ఆయనెక్కడ?కుటుంబం కోసం రాష్ట్రాన్ని దోచిపెట్టే నువ్వెక్కడ?’’ అని పేర్కొన్నారు.