గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ మండిపడ్డారు. రాజకీయాల్లో చంద్రబాబు ఓ ఊసరవెల్లి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆయన కుమారులు అవినీతి అనకొండలు అంటూ ధ్వజమెత్తారు. 

బీజేపీ సిద్ధాంతం స్టాట్యూ ఆఫ్ యూనిటీ అయితే చంద్రబాబు సిద్ధాంతం స్టాట్యూ ఆఫ్ ఆపర్చునిటీ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
ఆస్తుల కాపాడుకోవడానికే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారని విమర్శించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు చేసిన పనికి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.. కన్నా