ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మొత్తం ప్రజా వేదిక కూల్చివేత చుట్టూ తిరుగుతోంది. ఇటీవల జగన్ ఆదేశాల మేరకు ప్రజా వేదికను కూల్చివేశారు.

కాగా... ఈ ఘటనపై తాజాగా కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొని అక్రమ కట్టడాలను కలిపే తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రజావేదికను ప్రజల సొమ్ముతో నిర్మించారని... చంద్రబాబు సొమ్ముతో కాదని గుర్తు చేశారు. ఈ నిర్మాణానికి రూ.8 కోట్లు కాల్వలో పోశారన్నారు. 

ఆ వేదికను తొలగించకుండా ‘ప్రజా వైద్యశాల’కు ఉపయోగించాల్సిందన్నారు. అసలు ప్రజావేదికను తొలగించే అధికారం ఎవరు ఇచ్చారు..? అని వైఎస్ జగన్‌ను కన్నా ప్రశ్నించారు. అయితే అన్ని అక్రమ కట్టడాలను తొలగిస్తే బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.