Asianet News TeluguAsianet News Telugu

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ పై కనగరాజ్ కౌంటర్

హైకోర్టులో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖులు చేసిన పిటిషన్ పై ప్రస్తుత ఎస్ఈసీ కనగరాజ్ కౌంటర్ ధాఖలు చేశారు. నిమ్మగడ్డ చేసిన ఆరోపణల్లో నిజాలు లేవని ఆయన అన్నారు.

Kanagaraj files counter on Nimmagadda Ramesh Kumar petition in High Court
Author
Amaravathi, First Published Apr 27, 2020, 6:08 PM IST

అమరావతి: మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిల్ తో పాటు దాఖలైన 12 పిల్స్ కు ప్రస్తుత ఎస్ఈసీ కనగరాజ్ ఒకే కౌంటర్ ను దాఖలు చేశారు.  కౌంటర్‌ దాఖలులో ఆలస్యమైనందుకు మన్నించాలని ఆయన కోర్టును కోరారు. ఓటరు కానీ అభ్యర్ది కానీ కాకుండా ఎస్ఈసీ అర్హతలపై ఎలా రిట్ దాఖలు చేస్తారని కనగరాజ్ ప్రశ్నించారు.

నిమ్మగడ్డ మినహా మిగతా ఎవరెకీ ఈ అంశంలో పిల్ దాఖలు చేసే అర్హత లేదని కనగరాజ్ అన్నారు. గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్ ను పిటిషన్లర్లు ప్రశ్నించలేరని కనగరాజ్ అన్నారు. కేంద్రానికి భద్రత కోరుతూ నిమ్మగడ్డ దాఖలు చేసిన ఆఫీస్ ఫైల్స్ అందుబాటులో లేవని కనగరాజ్ చెప్పారు. ఆర్డినెన్స్ ద్వారా తొలగించాక నిమ్మగడ్డ కమిషనర్ హోదాలో పిల్ ఎలా వేస్తారని ప్రశ్నించారు.

ఎన్నికల కమిషనర్ నియామకం, సర్వీస్ రూల్స్ గవర్నర్ పరిధిలోనివేనని ఆయన అన్నారు. నిమ్మగడ్డ ప్రభుత్వ సేవకుడిగానే ఎన్నికల కమిషనర్ పదవిలో నియమితులయ్యారని, నిమ్మగడ్డ చెబుతున్న ఎన్నికల హింస ప్రస్తుతం సర్వసాధారణమని అన్నారు. స్ధానిక ఎన్నికలపై దాఖలైన ఫిర్యాదులు ఒక్కశాతం కూడా లేవని చెప్పారు. స్దానిక పోరు వాయిదాకు కారణమైన కేంద్ర ప్రభుత్వ కరోనా హెచ్చరికలను నిమ్మగడ్డ ప్రస్తావించలేదని అన్నారు

స్ధానిక ఎన్నికల వాయిదా కోసం నిమ్మగడ్డ ఎవరినీ సంప్రదించలేదని అన్నారు.ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రహస్యమన్న నిమ్మగడ్డ వాదనలో పసలేదని చెప్పారు. నిమ్మగడ్డ తొలగింపు కోసమే ఆర్డినెన్స్ తీసుకొచ్చారనే వాదన న్యాయపరంగా చెల్లదని అన్నారు. ఎన్నికల  ప్రక్రియలో పారదర్శకత కోసమే పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషనర్ నియామకానికి గవర్నర్ కు అన్ని అధికారాలున్నాయని చెప్పారు. 

చట్టంలో మార్పులతో నిమ్మగడ్డ పదవి కోల్పోయారని, ఆయన్ను ప్రభుత్వం తొలగించలేదని కనగరాజ్ అన్నారు. కానును లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఓ ప్రభుత్వోద్యోగిగా నిమ్మగడ్డ చెప్పకూడదని అన్నారు. ఎన్నికల కమిషనర్ విషయంలో చర్యలు తీసుకునేందుకు గవర్నర్ కు విచక్షణాధికారం ఉందని చెప్పారు. 

ఆర్డినెన్స్ విషయంలో గవర్నర్ నిబంధనలు ఉల్లంఘించారనడం సరికాదని అన్నారు. నిమ్మగడ్డ పిటిషన్లో పేరాలకు పేరాలు ఇతర పిటిషనర్లు కాపీ కొట్టారని కనగరాజ్ గుర్తు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios