కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి వీర విధేయుడు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వీర శివారెడ్డి కమలాపురం టికెట్ ఆశించి భంగపడ్డారు. చివరి నిమిషం వరకు ప్రయత్నించినప్పటికీ చంద్రబాబు ఆయనను కరుణించలేదు. దీంతో పార్టీ అధిష్టానంపై శివారెడ్డి అలక బూనారు.. కొద్దిరోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొనలేదు.

అయితే బాబు జోక్యం చేసుకుని ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని బుజ్జగించడంతో ఆయన తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా వైసీపీలో చేరాలని వీర శివారెడ్డి నిర్ణయించుకున్నారు.