Asianet News TeluguAsianet News Telugu

రాజ్యసభ ఎన్నికల్లో నైతిక విజయం టిడిపిదే: కళా వెంకట్రావు

తెలుగుదేశం పార్టీ విప్ ను అనుసరించి వర్ల రామయ్యకి ఓటు వేసి తమ నిబద్దతను ప్రకటించిన శాసన సభ్యులందరికి అభినందనలు తెలిపారు ఏపి టిడిపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు. 

Kala Venkatrao Comments on rajyasabha elections
Author
Amaravathi, First Published Jun 19, 2020, 9:47 PM IST

గుంటూరు: తెలుగుదేశం పార్టీ విప్ ను అనుసరించి వర్ల రామయ్యకి ఓటు వేసి తమ నిబద్దతను ప్రకటించిన శాసన సభ్యులందరికి అభినందనలు తెలిపారు ఏపి టిడిపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు. అధికార పార్టీ ప్రలోబాలు, ఒత్తిడిని లెక్క చేయక సామాజిక న్యాయానికి మద్దుతుగా వర్ల రామయ్యకి ఓటు వేయడం ద్వారా నైతిక విజయం చేకూర్చారు అని అన్నారు. 

''ఎక్కువ మంది వైకాపా శాసన సభ్యులుగా ఎస్సీ, ఎస్టీలు వున్నా రాజ్యసభలో దళితులకు మొండి చేయి చూపారు. బీసీ మంత్రులిద్దర్ని డిప్రమోషన్ చేసి సామాజిక న్యాయాన్ని మంటగలిపారు. తెలుగుదేశం పార్టీ విప్ ను ధిక్కరించిన ముగ్గురు శాసన సభ్యులపై ఫిరాయింపుల చట్ట ప్రకారం చర్యలు తీసుకొనుటకు తగు కార్యాచరణ చేపడతాం. తెలుగుదేశం పార్టీని నైతిక విజయం చేకూర్చిన శాసన సభ్యులందరికి మనస్ఫూర్తిగా మరోసారి అభినందనలు'' అని కళా వెంకట్రావు వెల్లడించారు. 

read more   రాజ్యసభ ఎన్నికల్లో ఆదిరెడ్డి భవాని పొరపాటు... చంద్రబాబు సీరియస్

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఆ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున మోపిదేవి వెంకట రమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. గెలిచిన నలుగురికి తలో 38 ఓట్లు వచ్చాయి.

తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి వర్ల రామయ్య 17 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈ విసయంతో రాజ్యసభలో వైసీపీ బలం ఆరుకు పెరిగింది. సంఖ్యాబలం లేకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థిగా వర్ల రామయ్యను బరిలోకి దింపారు. ఈ సందర్భంగా టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు కూడా పార్టీ విప్ ను జారీ చేసింది. 

ఈ సందర్భంగా పార్టీ విప్ ను ధిక్కరించకుండా  కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ ఓటింగ్ కి కూడా హాజరయ్యారు. వారు రాజ్యసభ ఎన్నికల్లో లెక్కింపు లో చెల్లకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios