Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు తోట నరసింహం తలనొప్పి: కాకుంటే వైసిపిలోకి...?

సారి ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండాలని కాకినాడ ఎంపీ తోట నరసింహం భావిస్తుండటం టీడీపీ అధినేతకు షాకిస్తోంది. అనారోగ్య కారణాలతో సతమతమవుతున్న ఆయన ఈసారి తనకు బదులుగా భార్యను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. 

kakinada tdp mp thota narasimham pulls out from 2019 loksabha elections
Author
Amaravathi, First Published Feb 19, 2019, 11:11 AM IST

టీడీపీకి చెందిన కీలక నేతలు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్తుండటంతో ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నేతల వలసలను అడ్డుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఎన్నికలకు ఇంకా కొద్దినెలలే ఉండటంతో ఈసారి తమకు టిక్కెట్ దొరకదేమోనన్న భయంతో చాలా మంది గోడ దూకేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఎప్పుడు ఎవరు ‘‘గోపీ’’ అవుతారోనని చంద్రబాబు తో పాటు పార్టీ శ్రేణులు ఆందోళనగా ఉన్నాయి.

వీరి కథ ఇలా ఉంటే ఈసారి ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండాలని కాకినాడ ఎంపీ తోట నరసింహం భావిస్తుండటం టీడీపీ అధినేతకు షాకిస్తోంది. అనారోగ్య కారణాలతో సతమతమవుతున్న ఆయన ఈసారి తనకు బదులుగా భార్యను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. 

దీనిలో భాగంగా ఈరోజు తోట నరసింహం తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నారు. తోట నరసింహాం విజ్ఞప్తి మేరకు ఆయన భార్యకు టీడీపీ చీఫ్ టికెట్ ఇస్తారా లేక కాకినాడను మరోకరికి కట్టుబెడతారా అంటూ చర్చ జరుగుతోంది. 

ఒకవేళ చంద్రబాబు కాదు కూడదు అంటే ఈ ఫ్యామిలీని వైసీపీలోకి లాగేందుకు జగన్ కూడా పావులు కదిపే అవకాశముంది. అయితే కోనసీమతో పాటు గోదావరి జిల్లాలో రాజకీయంగా తోట నరసింహానికి ఉన్న పలుకుబడి దృష్ట్యా సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios