రేపు విచారణకు రాలేను: సీబీఐకి వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ
మాజీ మంత్రి వైఎస్ వివేాకనందరెడ్డి హత్య కేసులో రేపు విచారణకు రాలేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశాడు.
హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాలున్నందున ఈ నెల 14వ తేదీన విచారణకు రాలేనని సీబీఐకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి సోమవారం నాడు లేఖ రాశాడు..ఈ లేఖకు సీబీఐ నుండి ఇంకా సమాధానం రాలేదు. ఈ నెల 10వ తేదీన సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యారు.
ఈ ఏడాది జనవరి 28, ఫిబ్రవరి 26న , ఈ నెల 10న వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.రేపు మరోసారి విచారణకు రావాలని సీబీఐ కోరింది. అయితే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున విచారణ నుండి మినహయింపు ఇవ్వాలని ఆ లేఖలో అవినాష్ రెడ్డి కోరారు. ఇవాళ హైకోర్టులో జరిగిన విచారణలో కూడా సీబీఐ విచారణ నుండి మినహయింపును కోరారు. అయితే ఈ విషయమై సీబీఐని కోరాలని హైకోర్టు సూచించింది. దీంతో ఆయన సీబీఐకి లేఖ రాశాడు.
సీబీఐ విచారణ పారదర్శకంగా జరగడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఈ నెల 9వ తేదీన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 10, ఈనెల 13న తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది తెలంగాణ హైకోర్టు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2019 మార్చి 19వ తేదీన పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు.ఈ కేసులో పలువురిని సీబీఐ అధికారులు అరెస్్ చేశారు. బెంగుళూరులో ల్యాండ్ సెటిల్ మెంట్ విషయమై వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనట్టుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ కేసులో అరెస్టైన దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారాడు.
also read:వైఎస్ వివేకా కేసు: రెండో భార్య, అల్లుడి పాత్రపై విచారణకు అవినాష్ రెడ్డి అఫిడవిట్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఆస్తుల కోసం జరిగిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి ముస్లిం మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. వారికి ఓ కోడుకు కూడా పుట్టాడన్నారు. రెండో భార్య కుటుంబానికి మొదటి భార్య కుటుంబానికి మధ్య ఆస్తుల గొడవలున్నాయన్నారు. ఈ గొడవల నేపథ్యంలోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఉండొచ్చని ఈ నెల 10 తేదీన అవినాష్ రెడ్డి మీడియాకు చెప్పారు.