ఎర్రచందనం అక్రమ రవాణాపై ఫోకస్ పెట్టిన కడప జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని చెక్‌పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయడంతో పాటు శేషాచలం కొండల్లో విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నారు. మరోవైపు స్మగ్లర్ల కోసం తమిళనాడులో సైతం వేటాడుతున్నారు.

ఈ నేపథ్యంలో విల్లుపురంలోని కలవరియన్ కొండల్లోని ఎర్రచందనం స్థావరాలపై కడప పోలీసులు మెరుపు దాడులు  చేశారు. అయితే స్థానికుల నుంచి పోలీసులకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. తమిళ మహిళలు ఏపీ పోలీసులను అడ్డుకుంటున్నారు. దీంతో కడప పోలీసులు, తమిళ పోలీసుల సాయంతో స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.