రెండో పెళ్లే కీలకం: వైఎస్ వివేకా హత్యపై వైఎస్ అవినాష్ రెడ్డి సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య  ఆస్తుల కోసం జరిగిందని  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు  చేశారు. 
 

Kadapa MP Avinash Reddy Sensational Comments on YS Vivekananda Reddy Murder Case

హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో  రెండో పెళ్లి కీలక అంశమని  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  చెప్పారు. వైఎస్  వివేకానందరెడ్డి హత్య  కేసులో  తనపై తప్పుడు  ప్రచారం చేస్తున్నారన్నారు..  శుక్రవారంనాడు  సీబీఐ విచారణ ముగిసిన తర్వాత  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  హైద్రాబాద్ లో  మీడియాతో మాట్లాడారు.  

వివేకానందరెడ్డికి  రెండో పెళ్లి  జరిగిందన్నారు. ముస్లిం మహిళను వివేకానందరెడ్డి 2005లో  వివాహంచేసుకున్నాడన్నారు. వాళ్లకు  ఓ కొడుకు కూడా పుట్టాడని  అవినాష్ రెడ్డి  చెప్పాడు.  రాజకీయాల్లో తన వారసుడిగా  అతడిని  చేయాలని  వివేకానందరెడ్డి భావించారని  అవినాష్ రెడ్డి  వివరించారు. .  తనపై ఉన్న ఆస్తులను కూడా రెండో భార్యపై రాయాలని   భావించారన్నారు. ఆస్తులపై  జరిగిన గొడవల వల్లే వివేకానందరెడ్డి  హత్య  జరిగిందని  ఆయన  చెప్పారు. వివేకా హత్య కేసులో  రెండో పెళ్లి కూడా కీలక అంశమని  అవినాష్ రెడ్డి  అభిప్రాయపడ్డారు.

తాను  టార్గెట్ గా   వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సాగుతుందన్నారు.  తనపై  తన సోదరి సునీతమ్మ  ఆరోపణలు  చేసినా తాను  మౌనంగా  ఉన్నట్టుగా  చెప్పారు. కానీ ఈ విషయమై తాను మౌనంగా  ఉంటే  తమ పార్టీ క్యాడర్ లో కూడా గందరగోళం నెలకొందన్నారు. అందుకే  తాను ఈ విషయమై  నోరు విప్పాల్సి వచ్చిందన్నారు.  వివేకానందరెడ్డి గుండెపోటుతో  మరణించినట్టుగా  తాను  ఎక్కడా  చెప్పలేదన్నారు.  వివేకా హత్య  రోజున ఇంట్లో దొరికిన  లేఖను  సునీతమ్మ భర్త దాచిపెట్టాలని  ఎందుకు చెప్పారని  అవినాష్ రెడ్డి  ప్రశ్నించారు.  

also read:వైఎస్ వివేకా హత్య కేసు రికార్డులన్నీ అప్పగించాలి: తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం

తనపై ఆరోపణల్లో పెద్ద కుట్ర ఉందని  వైఎస్ అవినాష్ రెడ్డి  చెప్పారు.  తన వైపు ఎలాంటి తప్పు లేదన్నారు. ఈ విషయమై  తాను  న్యాయపోరాటం  చేస్తానని  ఆయన  ప్రకటించారు.  సీబీఐ  విచారణలో  ఉన్నందున  తనకు  తెలంగాణ హైకోర్టు  తీర్పు  గురించి తనకు  తెలియదన్నారు. మరోసారి విచారణకు పిలుస్తామని సీబీఐ అధికారులు తెలిపినట్టుగా  అవినాష్ రెడ్డి  చెప్పారు.  సీబీఐ విచారణ తప్పుదోవ పడుతుందన్నారు.  కీలక విషయాలను పక్కనబెట్టి తనను  విచారణకు పిలిచినట్టుగా  ఆయన  చెప్పారు.  తాను ఏ తప్పు చేయలేదన్నారు.  నిన్న తాను తెలంగాణ  హైకోర్టులో లంచ్ మోషన్   హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేయగానే   తన సోదరి వైఎస్ సునీతారెడ్డికి  సమాచారం  ఇచ్చారని  ఆయన  సీబీఐపై  ఆరోపణలు  చేశారు.సీబీఐ లీకులు ఇస్తుందన్నారు. 

హత్యకు  ముందు  రోజున  ఎంపీ అభ్యర్ధిగా తనకు , ఎమ్మెల్యే అభ్యర్ధిగా రఘురామిరెడ్డికి ఓటేయాలని  వివేకానందరెడ్డి ప్రచారం చేశారన్నారు. ఎంపీ టికెట్  కోసం  ఈ హత్య  జరిగిందనే  ప్రచారం హస్యాస్పదంగా  ఆయన  పేర్కొన్నారు. వివేకా హత్య  కేసులో  ఎనిమిది మంది సాక్షులు  చెప్పిన మాటలను సీబీఐ పట్టించుకోవడం లేదన్నారు. వివేకానందరెడ్డి హత్య కు బెంగుళూరు సెటిల్ మెంట్ కారణం కాదని ఆయన  చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios