Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యేగా గెలవకుండానే ఏడు పార్టీలు మారావ్.. పవన్ పై కేఏపాల్

ఇటీవలే తెలంగాణలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఆ తరువాత బీజేపీకి మద్దతు ఇస్తా అని నిలకడ లేని మనస్థత్వం ఎంటని ప్రశ్నించాడు. 

KA Paul Shocking Comments on Pawan Kalyan
Author
Hyderabad, First Published Jan 8, 2021, 10:16 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. త్వరలో తిరుపతి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. కాగా..  ఈ నేపథ్యంలో పవన్ పై కేఏ పాల్ విమర్శల వర్షం కురిపించారు.

కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకుండానే.. పవన్ ఏడు పార్టీలు మారాడని.. ఆ ఘనత కేవలం పవన్ కే దక్కిందని  కేఏ పాల్ ఎద్దేవా చేశారు. ‘‘ఓరిజినల్ పార్టీ ప్రజారాజ్యం.. తరువాత కాంగ్రెస్‌లో చేరారు. తరువాత సీపీఐ సీపీఎం.. ఆ తరువాత బీఎస్పీ మాయావతి కాళ్లపై పడ్డావ్ తమ్ముడూ.. మరలా బీజేపీ అన్నావ్.. మళ్లీ ఇప్పుడు బీజేపీ అంటున్నావ్’’ అని విమర్శించారు. 

ఇటీవలే తెలంగాణలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఆ తరువాత బీజేపీకి మద్దతు ఇస్తా అని నిలకడ లేని మనస్థత్వం ఎంటని ప్రశ్నించాడు. ఈ సంద్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ... ‘‘నీకు 5 శాతం ఓటు బ్యాంక్ ఉంది కదా.. బీజేపీకి ఒక్కశాతం కూడా ఓటింగ్ లేదు. నువ్వు బీజేపీ ఏజెంట్ కాకపోతే తిరుపతిలో ఖచ్చితంగా పోటీ చేసేవాడివి. పవన్‌ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో గమనించండి’’ అని చెప్పుకొచ్చారు.

‘ కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లో ఎందుకు లాగుతావ్.. నిజంగా నీకు సేవ చేయాలి అని ఉంటే నువ్వు తిరుపతి బై పోల్‌లో నిలబడు.. లేదంటే మీ అన్నని నిలబెట్టు.. నీ పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తినైనా నిలబెట్టు అని హితవు పలికారు. అప్పుడు నువ్ బీజేపీ ఏజెంట్ కాదని రుజువు చేసుకో ’ అంటూ పవన్ కి సవాల్ విసిరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios