Asianet News TeluguAsianet News Telugu

పాపం పాల్.. చాలా చోట్ల 300కు మించి పడలే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. ఒక స్ట్రాటజీ ప్రకారం వైసీపీ గుర్తు, అభ్యర్ధుల పేర్లతో పోలిన పేర్లు గల వారిని బరిలోకి దించారు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

ka paul prajashanti party situation in andhra pradesh
Author
Amaravathi, First Published May 26, 2019, 3:29 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. ఒక స్ట్రాటజీ ప్రకారం వైసీపీ గుర్తు, అభ్యర్ధుల పేర్లతో పోలిన పేర్లు గల వారిని బరిలోకి దించారు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.

అయినప్పటికీ జనం ఆ పార్టీని పట్టించుకోలేదు. ఈ పార్టీకి కేటాయించిన హెలికాఫ్టర్ గుర్తులోని ఫ్యాన్ రెక్కలు, వైసీపీ ఫ్యాన్ గుర్తు రెక్కలు ఒకేలా ఉండటంతో పాటు పేర్లలో పోలిక ఉండటంతో ఎన్నికలకు ముందు వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేసింది.

దీనిపై వైసీపీ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. కాగా ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధులకు అత్యధికంగా ఆలూరులో 1,327 ఓట్లు రాగా, పలమనేరులో 1107, ఒంగోలులో 400, పెనమలూరులో 300, జమ్మలమడుగులో అత్యల్పంగా 119 ఓట్లే వచ్చాయి.

రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా 300కు మించి ఓట్లు రాలేదు. ఫలితాల తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ.. ప్రజాశాంతి పార్టీకి పడాల్సిన ఓట్లు.. వైసీపీ ఫ్యాన్‌కు పడ్డాయని విమర్శించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios