అమరావతి: కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థి కె.ఎస్‌.లక్ష్మణరావు ఘన విజయం సాధించారు. 68,120 ఓట్ల మెజారిటీతో లక్ష్మణరావు సమీప ప్రత్యర్థి నూతపాటి అంజయ్యపై గెలుపొందారు. 

ఈ ఎన్నికల్లో మెుత్తం 1,49,319 ఓట్లు పోలవ్వగా లక్ష్మణరావుకు 80,670 పోలయ్యాయి. లక్ష్మణరావు గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రెండు సార్లు ఎన్నికయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్త శుద్దితో కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. లక్ష్మణరావు భారీ ఆధిక్యంతో గెలుపొందడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు.