ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం రావడంతో టీడీపీ హయాంలో వివిధ నామినేటెడ్ పదవులలో నియమితులైన వారు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ పదవికి జూపూడి ప్రభాకర్ రాజీనామా చేశారు.

ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకు పంపారు. ఇక ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణ, బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ వేమూరి ఆనందప్రసాద్, వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌ జలీల్ ఖాన్, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు తమ పదవులకు ఇప్పటికే రాజీనామా చేశారు.