కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ పై ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జపూడి ప్రభాకర్ రావు మండిపడ్డారు.
కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ పై ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జపూడి ప్రభాకర్ రావు మండిపడ్డారు. ఉక్కు కర్మాగారం గురించి సమాచారం ఇవ్వలేదని రాజ్ నాథ్ సింగ్ చెప్పడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

శనివారం రాష్ట్ర రాజధాని అమరావతిలో జూపూడి మీడియాతో మాట్లాడారు. ఏపీ కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తామంటూ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కేంద్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఏపీకి కాకుండా వైసీపీ అధినేత జగన్ కి ఇస్తుందని అన్నారు.
తమకు ఎలాంటి స్పెషల్ ట్రట్మెంట్ అవసరం లేదని.. కేవలం హోదా ఇస్తే చాలతు అని స్పష్టం చేశారు. చంద్రబాబుపై చేస్తున్న విష ప్రయోగానికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. మోదీ జగన్, కేసీఆర్ లు ముగ్గురూ ఒక్కటై.. ఏపీపై దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు.
