సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్ బాలకృష్ణకు ఫోన్ చేశారు. గుండెపోటుకు గురైన సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఈ సందర్భంగా తారక్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. 

గుండెపోటుకు గురైన సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్న చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద నందమూరి బాలకృష్ణ, ఇతర టీడీపీ నేతలు వుండి పరిస్ధితిని ఎప్పటికప్పుడు పార్టీ హైకమాండ్‌కు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్న సోదరుడు, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్ బాలకృష్ణకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీశారు. డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేశారని, ఆయన కోలుకుంటున్నట్లుగా బాలయ్య జూనియర్‌తో చెప్పినట్లుగా తెలుస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరోవైపు తారకరత్న ఆరోగ్య పరిస్ధితిపై బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఆయనను మరింత మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలిస్తామన్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలయ్య తెలిపారు. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయ్యిందని.. మిగిలిన అన్ని రిపోర్టులు బాగున్నాయని బాలకృష్ణ వెల్లడించారు. 

ALso REad: విషమంగానే పరిస్థితి.. తారకరత్న ఆరోగ్యంపై బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు, ఆందోళనలో ఫ్యాన్స్

కాగా.. కుప్పంలో నారా లోకేష్ యువగళం పేరుతో శుక్రవారం నాడు పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో లోకేష్ తో పాటు తారకరత్న పాల్గొన్నారు. ఈ సమయంలో తారకరత్న ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తొలుత కేసీ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి..అక్కడి నుండి పీఈఎస్ మెడికల్ కాలేజీకి తారకరత్నను తరలించారు. అనంతరం పీఈఎస్ మెడికల్ కాలేజీ వైద్యులకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. తారకరత్నకు మెరుగైన వ్యైద్య సహయం అందించాలని చంద్రబాబు కోరారు. తారకరత్నకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నంతసేపు బాలకృష్ణ అక్కడే ఉన్నారు. ఆయన వెంట రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు.