Asianet News TeluguAsianet News Telugu

జేడీ లక్ష్మీ నారాయణ : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం.. 

JD Lakshminarayana Biography: ప్రొఫైల్ కేసులో ఏ మాత్రం వెనకడుగు వేయని అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అదే వేగంతో అంకితభావంతో సమాజాన్ని ముందుకు కదిలించాలన్నది ఆయన ఆశయం. ఆ భావనతోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. కానీ, తొలి ప్రయత్నంలో ఎదురు దెబ్బ తగిలిన వెన్ను చూపకుండా ముందుకే దూసుకెళ్తున్నారు. తన ఆశయ సాధనలో భాగం ఏపీలో కొత్త పార్టీ పెట్టారు. అతనే  వాసగిరి లక్ష్మీనారాయణ .. అందరికీ జేడీ లక్ష్మీనారాయణ సుపరిచితం. ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీ నారాయణ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం మీకోసం.. 

JD Lakshminarayana Biography, Age, Caste, Children, Family, Political Career KRJ
Author
First Published Mar 22, 2024, 2:45 AM IST

JD Lakshminarayana Biography: రాజకీయ నాయకులను, సీనియర్ ఐఏఎస్ అధికారులను, సీనియర్ జడ్జిలు సైతం కటకటాల వెనక్కినెట్టారు. దేశంలో ఏ ఇతర పోలీస్ అధికారి చూపించని ధైర్యసహాసాలను  ప్రదర్శించి సాధారణ ప్రజల దృష్టిలో సంచలన హీరోగా నిలిచారు. ఆయన మరెవరో కాదు సీబీఐ మాజీ జాయిన్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ఆయన వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం మీకోసం.. 

బాల్యం, విద్యాభ్యాసం

జేడీ లక్ష్మినారాయణ 1965 ఏప్రిల్ 3 న కర్నూలు జిల్లా శ్రీశైలం లో జన్మించారు. ఆయన పాఠశాల విద్య స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఆ తరువాత వరంగల్ లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో  ఇంజరీరింగ్ పూర్తిచేశారు. తర్వాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఎం.టెక్ పూర్తి చేశారు. సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలనే సంకల్పంతో సివిల్ సర్వీసు పరీక్ష ఉత్తీర్ణులై మహారాష్ట్ర కేడర్ ఐ.పి.ఎస్ అధికారిగా చేరారు.

ప్రారంభ జీవితం

శిక్షణ పూర్తి అయినా తరువాత నందేడ్ లో ఎస్.పి గా బాధ్యతలు చేపట్టారు.తర్వాత మహారాష్ట్ర నందు ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గా పనిచేశారు.  ఆయన నిజాయితీని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సిబిఐ లో డీఐజీ గాని నియమించింది హైదరాబాదులో సీబీఐ జేడీగా ప్రమోట్ చేశారు. 

సంచలనాల కేసుల దర్యాప్తు

జేడీ లక్ష్మీనారాయణ మొదట్లో ఎవరికీ అంతగా తెలియదు. ఆయన సీబీఐలో చేరిన  కొత్తలో తొలుత ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు నమోదైంది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన ఓబులాపురం మైనింగ్ కేసు, అవుటర్‌ రింగ్‌రోడ్డులో భూసేకరణ, అందులో జరిగిన అక్రమాలకు సంబంధించి దర్యాప్తు జరిపి న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. ఈ  సమయంలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా సక్సెస్ పుల్ గా డీల్ చేయించడంల వివి లక్ష్మీనారాయణ ఇంటి పేరే జెడిగా మారిపోయింది. 

ఈ వివాదం సద్దుమణిగేలోపే సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం కేసు సీబీఐకి బదిలీ అయింది. ఈ కేసు దర్యాప్తు ఆయనను ఎన్నో ప్రభోలకు గురి చేసినా, బెదిరింపులకు పాల్పడిన ఆయన ఏ మాత్రం చలించలేదు. దాదాపు రూ.ఏడు వేలకోట్ల కుంభకోణానికి సంబంధించిన ఈ కేసులో సమర్థంగా దర్యాప్తు చేయడంతో లక్ష్మీనారాయణ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ కేసు కొలిక్కి వచ్చేలోపే దాదాపు ఒకే సమయంలో ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసు, జగన్‌ అక్రమ ఆస్తుల కేసు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులు తన ముందుకు వచ్చాయి.

ఈ కేసులన్నీ రాజకీయ నేతలు, వారి అధికారంతో ముడిపడినవి. ఈ (ఓఎంసీ )కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటక ఎంపీ గాలి జనార్దనరెడ్డి, ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డిలను అరెస్టు చేయడంతో లక్ష్మీనారాయణ ఒక్కసారిగా హీరో అయ్యారు. ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా.. ఈ కేసులో వరుసగా అరెస్టులు జరిగాయి. ఇందులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి, మైనింగ్‌ శాఖ ఉన్నతాధికారి రాజ్‌గోపాల్‌ ముఖ్యులు. దీంతోపాటు ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులో పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బి.పి.ఆచార్యలను అరెస్టు చేశారు. 

ఇదే సమయంలో జగన్‌ అక్రమ ఆస్తుల కేసును కూడా  జేడీ లక్ష్మీనారాయణనే దర్యాప్తు చేశారు. ఈ కేసులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌, అప్పటి మంత్రి మోపిదేవి వెంకట రమణ తదితరులతోపాటు కడప ఎంపీ జగన్‌ను కూడా అరెస్టు చేశారు. ఇలా దూకుడుగా వ్యవహరిస్తూ.. వరుసగా అరెస్టులు చేశారు. మరోవైపు.. జగన్‌ అక్రమ ఆస్తుల కేసు విషయంలోనే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావులు తమ పదవులు పోగొట్టుకున్నారు. మరో ఇద్దరు ముగ్గురు మంత్రుల ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరోవైపు.. ఓఎంసీ కేసులో అరెస్టయిన గాలి జనార్దన రెడ్డికి అక్రమ పద్ధతుల్లో బెయిల్‌ ఇప్పించేందుకు పెద్ద ఎత్తున మంతనాలు జరుగుతున్నాయి. దీంతో ఈ విషయంపై  సీబీఐ కన్నేసింది. ఈ క్రమంలో లంచం తీసుకున్న  ఇద్దరు జడ్జీలను, ఒక మాజీ న్యాయమూర్తిని అరెస్టు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా మారుమోగింది. 

మరోవైపు.. కర్ణాటకలో రాజకీయంగా దుమారం రేపిన గనుల కుంభకోణానికి సంబంధించి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై నమోదయిన కేసు దర్యాప్తు కూడా లక్ష్మీనారాయణే పర్యవేక్షించారు. ఆ తరువాత మాజీ సీఎం  వై.ఎస్ .రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై కూడా ఆయనే దర్యాప్తు చేశారు. జగన్ అక్రమ ఆస్తుల కేసు తప్ప మిగతా కేసుల దర్యాప్తు దాదాపు పూర్తికావొచ్చింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రాబుద్దీన్, ఇష్రాత్ జహాన్ ల ఎన్ కౌంటర్ల కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యత లక్ష్మీనారాయణకు అప్పగించారు. రాజకీయంగా వివాదాస్పదమైన ఈ కేసులను కూడా లక్ష్మీనారాయణకు అప్పగించడం ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.

స్వచ్చంద పదవీ విరమణ, రాజకీయ ప్రవేశం

వి.వి. లక్ష్మీనారాయణ 2018 మార్చిలో స్వచ్చంద పదవీ విరమణ చేశారు.  ఆయన విశిష్ట సేవలకు గాను ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ అందుకున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 2019లో జనసేన పార్టీలో చేశారు. అదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం ఎం పీ అభ్యర్థులుగా పోటీ చేసి తొలి ప్రయత్నంలో ఓడిపోయారు. కొన్ని అనివార్య కారణాలతో జనసేనను వీడి..తనే స్వంతంగా ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సారి కూడా విశాఖ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios