కర్నూల్: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని కర్నూల్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొన్నారు.

శుక్రవారం నాడు కర్నూల్ జిల్లా ఓర్వకల్లు పోలీస్ స్టేషన్లో జేసీ ప్రభాకర్ రెడ్డిపై వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ కోసం ఓర్వకల్లు పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు కడప జైలు నుండి కర్నూల్ కు తీసుకొచ్చారు.

కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు పోలీసులు పరీక్షలునిర్వహించారు. ఏడు గంటల పాటే కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ సమయంలోనే అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్ గురించి జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు విచారించనున్నారు.

also read:ఎవరిని విచారిస్తే నిజాలు బయటపడతాయో విచారణలో చెప్పారు: జేసీ లాయర్

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను అనంతపురం పోలీసులు ఈ ఏడాది జూన్ 13వ తేదీన అరెస్ట్ చేశారు.  బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా నకిలీ డాక్యుమెంట్లుగా సృష్టించి విక్రయించారని జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడిపై కేసులు నమోదయ్యాయి. 154 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో విక్రయించారని ఫిర్యాదుల మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.