టీడీపీ-జనసేన పొత్తు.. పవన్ కల్యాణ్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తుపై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలో టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం పవన్‌కు ఏముందని ఆయన ప్రశ్నించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తుపై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి సాగుతుందన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని రక్షించడం కోసమే టీడీపీతో పవన్ చేతులు కలిపారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును జైల్లో కలిసిన పవన్ అక్కడ సెటిల్‌మెంట్లు చేసుకున్నారని, ప్యాకేజ్ సెట్ చేసుకున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను జేసీ ప్రభాకర్ రెడ్డి ఖండించారు. ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం పవన్‌కు ఏముందని ఆయన ప్రశ్నించారు.
ALso Read: బీజేపీని తీసుకొచ్చే బాధ్యతను పవన్‌కు చంద్రబాబు అప్పగించారేమో: సజ్జల
ఇంకో రెండు సినిమాలు చేసుకుంటే కావాల్సినంత డబ్బు వస్తుందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబును కలిసిందే 45 నిమిషాలని.. ఆ కాస్త సమయంలోనే ప్యాకేజీలు, సీట్లు సెటిల్ చేసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. కోట్ల రూపాయలు తెచ్చిపెట్టే సినిమాలను వదులుకుని ప్రజల కోసం పవన్ రాజకీయాల్లోకి వచ్చారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలనే టీడీపీతో నడిచేందుకు ఆయన సిద్ధమయ్యారని జేసీ పేర్కొన్నారు. జగన్ ఒక పర్వెర్టెడ్ అని.. ఆయనను ఎర్రగడ్డకు పంపించాల్సిందేనని ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.