West Godavari Bus Accident : బస్సు పర్ఫెక్ట్.. మానవ తప్పిదమే వల్లే ప్రమాదం : అధికారులు
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో బుధవారం ప్రమాదానికి గురైన బస్సు కొత్తదని .. ఎలాంటి సమస్యలు లేవని నిపుణులు అంటున్నారు. గత వారం రోజులుగా ఎలాంటి సమస్యలు లేవని.. రాలేదని డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ చెబుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో బుధవారం ప్రమాదానికి గురైన బస్సు కొత్తదని .. ఎలాంటి సమస్యలు లేవని నిపుణులు అంటున్నారు. గత వారం రోజులుగా ఎలాంటి సమస్యలు లేవని.. రాలేదని డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ చెబుతున్నారు. బస్సులో టెక్నికల్ సమస్యలు తలెత్తలేదని తెలిపారు. ఈ బస్సు 3 లక్షల 11 కి.మీ మాత్రమే తిరిగిందని తెలిపారు. ఇది కొత్త బస్సు కిందే లెక్క అని.. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. డ్రైవర్ చిన్నారావు రోడ్డును సరిగా అంచనా వేయలేకపోయాడని ఇంజనీర్ అంటున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారని ఆయన వెల్లడించారు.
కాగా.. పశ్చిమ గోదావరి (west godavari bus accident) జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటనపై సీఎం జగన్ (ys jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలిపిన సీఎం బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
Also Read:West Godavari Accident: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా: సీఎం జగన్ ప్రకటన
ఇక ఈ బస్సు ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (chandrababu naidu) కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆర్టిసి బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులోకి దూసుకెళ్లిన ఘటనలో డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న టిడిపి (TDP) శ్రేణులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టిసి బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెంకు దాదాపు 43 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు జల్లేరు వద్ద ప్రమాదానికి గురయ్యింది. జల్లేరు వాగుపై గల వంతెనపై ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి బస్సు అదుపుతప్పింది. దీంతో బస్సు అమాంతం వంతెనపైనుండి వాగులోకి పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించినట్లుగా తెలుస్తోంది.