తిరుపతి బైపోల్: బీజేపీ అభ్యర్థి రత్నప్రభపై ఫిర్యాదు
తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభపై ఐదు కేసులు పెండింగ్ లో ఉన్నాయని జనతాదళ్ (యూ) నేత ఏవీ రమణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబుకు బుధవారం నాడు ఫిర్యాదు చేశారు.
తిరుపతి: తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభపై ఐదు కేసులు పెండింగ్ లో ఉన్నాయని జనతాదళ్ (యూ) నేత ఏవీ రమణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబుకు బుధవారం నాడు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల కమిషన్ కు సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తనపై ఎలాంటి కేసులు లేవని ఆమె ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హైద్రాబాద్ బంజారాహిల్స్, సైఫాబాద్, ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్లలో ఆమెపై ఐదు కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.అలాగే కుల ధృవీకరణ పత్రాలకు సంబంధించిన రికార్డులు లేవన్నారు. దీంతో రత్నప్రభ నామినేషన్ ను తిరస్కరించాలని ఆయన ఆ ఫిర్యాదులో కోరారు.
తిరుపతి ఎంపీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్, వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురమూర్తి పోటీ చేస్తున్నారు. బీజేపీ, జనసేన కూటమి అభ్యర్ధిగా రత్నప్రభ పోటీ చేస్తున్నారు.