రాజోలు: వైయస్ఆర్  రైతు భరోసా పథకం ప్రారంభోత్సవంలో తనకు అవమానం జరిగిందని ఆరోపించారు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. రాజోలు నియోజకవర్గం శివకోడు కాపు కళ్యాణమండపంలో రైతు భరోసా పథకాన్ని ఎమ్మెల్యే రాపాక ప్రారంభించాల్సి ఉండగా తాను లేకుండానే వైసీపీ నేతలు ప్రారంభించారని మండిపడ్డారు.  

తాను లేకుండా ప్రభుత్వ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు ప్రారంభించారని మండిపడ్డారు. వేదిక దగ్గరకు వచ్చినా కనీసం ఆహ్వానించే వ్యవసాయ శాఖ అధికారి కనుచూపు మేరలో కనిపించలేదని మండిపడ్డారు.  

ప్రభుత్వ కార్యక్రమాలను నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తనతో ప్రారంభించాలని అలాంటిది తాను లేకుండానే పథకాన్ని ప్రారంభించేశారని మండిపడ్డారు. అంతేకాదు వేదికపై అధికారులు కన్నా వైసీపీ నేతలే ఎక్కువగా కనిపించారని మండిపడ్డారు. 

వైయస్ఆర్ రైతు భరోసా పథకం ప్రభుత్వ పథకం అని దాన్ని ఒక ఎమ్మెల్యేగా తానే ప్రారంభిచాలని చెప్పుకొచ్చారు. ఇదేమీ వైసీపీ మీటింగ్ కాదు  కదా అంటూ నిలదీశారు. ఎమ్మెల్యేగా తాను లేకుండా ఎలా ప్రారంభిస్తారంటూ మండిపడ్డారు. అగ్రికల్చర్ అధికారి ఒక చేతకానివాడిలా వ్యవహరించారంటూ మండిపడ్డారు. 

రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ అధికారంలో ఉన్నట్లేనని చెప్పుకొచ్చారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా రాష్ట్రమంతటా ఎలా గౌరవిస్తుందో రాజోలు నియోజకవర్గంలో తనను అలాగే గౌరవించాల్సి ఉందన్నారు. 

వేదికపై అధికారులు కన్నా వైసీపీ నాయకులే ఎక్కువగా కనిపించారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రాకుండానే పథకాన్ని ప్రారంభించిన వ్యవసాయ శాఖ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని రాపాక డిమాండ్ చేశారు. 

జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డికి తాను ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చారు. ఇది పార్టీ సమావేశం కాదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం అని చెప్పుకొచ్చారు. రైతు భరోసా పథకానికి కేంద్రం రూ.6వేలు ఇస్తుందని రాష్ట్రప్రభుత్వం రూ.7,500 ఇస్తుందని ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం తనకు ఉందన్నారు.

అయితే బలనిరూపణ కోసం సభకు వైసీపీ నేతలు వచ్చారని విమర్శించారు. బలనిరూపణ చేయాలనుకుంటే తన బలం ముందు వీళ్లేవరు నిలబడలేరని చెప్పుకొచ్చారు. తోకలన్నీ వచ్చాయని మండిపడ్డారు. అయితే ప్రజాస్వామ్యబద్దంగా వెళ్తానని చెప్పుకొచ్చారు. 

ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నానని వైసీపీలా రౌడీ రాజకీయాలు చేయదలచుకులేదన్నారు. ఒకవేళ రౌడీ రాజకీయాలు చేయాలంటే తనకు ఎవరూ సరిపోరని చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులు ఇప్పటికైనా ఎమ్మెల్యేకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని సూచించారు. 

తనకు సీఎం జగన్ అంటే ఎంతో గౌరవమని ఆయనను రాష్ట్రముఖ్యమంత్రిగా తానుగౌరవిస్తానని చెప్పుకొచ్చారు. అలాగే నియోజకవర్గంలో కూడా తనను కూడా గౌరవించాలని కోరారు. అంతేగానీ వైసీపీ నేతలు బలనిరూపణ చేసుకుందామంటే తర్వాత జరగబోయే మీటింగ్ కు రావాలని సవాల్ విసిరారు. 

రాబోయే రోజుల్లో తాను హాజరయ్యే సమావేశంలో బలనిరూపణ చేసుకునేందుకు వైసీపీ నేతలు సిద్ధం కావాలన్నారు. అక్కడ తన బలమేంటో తేల్చుకుందామని సవాల్ విసిరారు. తన బలనిరూపణ చేసుకోవాలంటే ఎవరూ సరిపోరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాపాక వరప్రసాదరావు.  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం రైతు భరోసా. నెల్లూరు జిల్లాలో సీఎం వైయస్ జగన్ ఘనంగా పథకాన్ని ప్రారంభిస్తే ఇతర జిల్లాలలో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.