కర్నూల్: రాయలసీమ పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఆదివారం నుంచి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మూడురోజుల పాటు జిల్లాలోనే పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. జిల్లాలోని సమస్యలపై  ప్రజలను అడిగి తెలుసుకోనున్నారు. 

ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కర్నూలుకు చేరుకుని అక్కడ నుంచి సి క్యాంపు సెంటర్ కు చేరుకుంటారు. సీ క్యాంపు సెంటర్ నుంచి నుంచి కొండారెడ్డి బురుజు వరకు జనసేన పార్టీ నిర్వహించనున్న రోడ్ షో లో పాల్గొంటారు. 

 

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. 25న ఆదోని నియోజకవర్గంలో పర్యటించి అక్కడ రైతులతో పవన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. 

అనంతరం నిర్వహించిన సమావేశంలో పవన్ పాల్గొంటారు. 26న ఆళ్లగడ్డలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. మెుత్తం మూడు రోజులపాటు పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలోనే ఉండనున్నారు. పవన్ కళ్యాణ్  రాక సందర్భంగా ఘన స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.