Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే రాపాకకు పవన్ అభినందనలు : పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ

రాజకీయంగా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా వ్యూహరచన చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. నిజమైన కార్యకర్తలును గుర్తించి వారిని ముందుకు తీసుకెళ్తూ వారి సూచనలు సలహాలతో పార్టీని విజయపథంలో దూసుకెళ్లేలా చేస్తామని పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 

janasena party chief pawan kalyan praises mla rapaka varaprasadarao
Author
Amaravathi, First Published Jul 29, 2019, 8:02 PM IST

అమరావతి: జనసేన పార్టీ ప్రజలపక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో జనసేన పార్టీ పనిచేస్తుందని పవన్ స్పష్టం చేశారు. 

పవన్ కళ్యాణ్ సారథ్యంలో తొలిసారిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీకి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తోపాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, సభ్యులు నాగబాబు, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ లతోపాటు సభ్యులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా అసెంబ్లీలో జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రజలగొంతుకు వినిపిస్తున్నారంటూ పవన్ ప్రశంసించారు. ప్రజా సమస్యలపై మరింత గళమెత్తి అసెంబ్లీ సాక్షిగా జనసేన పార్టీ పోరాటం చేయాలని సూచించారు. 

మరోవైపు జనసేన పార్టీ పటిష్టత కోసం ప్రతీ కార్యకర్త నిస్వార్థంగా పనిచేయాలని పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణంలో భాగంగా వ్యక్తిగత అజెండాతో ఎవరూ ఉండొద్దని హితవు పలికారు. 

నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం దిశగా జనసేన పనిచేయాలని సూచించారు. స్వార్థం కోసం, వ్యక్తిగత లబ్ధికోసం ఏ కార్యకర్త పనిచేస్తే సహించేది లేదన్నారు. 

గత ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించాలని పోరాటం చేసిన పార్టీ కార్యకర్తలకు, అభ్యర్థులకు, అభిమానులకు అఫైర్స్ కమిటీ అభినందనలు తెలిపింది. కార్యకర్తల పోరాటలకు ధన్యవాదాలు తెలిపింది. 

అలాగే గత అసెంబ్లీలో ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి మృతిచెందిన కార్యకర్త కొప్పినీడు మురళీకి నివాళులర్పించింది. ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. త్వరలో వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉన్నామని భరోసా కల్పిస్తామన్నారు. 

రాజకీయంగా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా వ్యూహరచన చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. నిజమైన కార్యకర్తలును గుర్తించి వారిని ముందుకు తీసుకెళ్తూ వారి సూచనలు సలహాలతో పార్టీని విజయపథంలో దూసుకెళ్లేలా చేస్తామని పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios