ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ కూడా విషెస్ తెలియజేశారు. కాగా.. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా జగన్ కి విషెస్ చేయడం గమనార్హం.

‘ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు ’అంటూ ట్వీట్ చేశారు. జగన్‌ను ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. కాగా.. ఆయన  చేసిన ట్వీట్ పై జనసేన అభిమానులు కౌంటర్స్ వేయడం గమనార్హం.

ఈ ట్వీట్‌తో పాటూ ఉన్న ఫోటోను టార్గెట్ చేశారు.. ఆ ఫోటోలో రఘురామ ముఖ్యమంత్రి జగన్ చేయి పట్టుకుని కనిపించారు. దీంతో చాలా అర్ధాలు చెప్పుుకొచ్చారు.. ఎంపీ రాజుగారిదే అప్పర్ హ్యాండ్ అంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.. ఫోటో చాలా బావుంది అంటూ కామెంట్స్ పెట్టారు. ఈ ఫోటోలో చాలా అర్ధాలు ఉన్నాయంటున్నారు. అంతేకాదు ట్వీట్‌లో 'గారు' ఎందుకు మిస్ అయ్యిందంటూ ప్రశ్నించారు. మొత్తానికి రఘురామ తన బర్త్ డే విషెస్‌తో కూడా ప్రత్యేకత చాటుకున్నారు.