రిషికొండను పరిశీలించిన పవన్ కల్యాణ్... మట్టి గుట్టపైకెక్కి, అంతా తిరుగుతూ ఆరా (వీడియో)
విశాఖపట్నంలోని రిషికొండ ప్రాంతాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సందర్శించారు. కొండపై జరుగుతున్న పనులు ఏంటని ఆయన అడిగి తెలుసుకున్నారు. అక్కడ వున్న గుట్టపైకెక్కి ఆ ప్రాంతమంతా కలియ తిరిగారు పవన్.
ప్రస్తుతం విశాఖ పర్యటనలో వున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ నగరంలోని రిషికొండను పరిశీలించారు. ఇటీవల రిషికొండ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌పై జనసేన నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని విశాఖను వీడిన వెంటనే స్థానిక జనసేన నేతలతో కలిసి రిషికొండకు చేరుకున్నారు పవన్. అనంతరం కొండపై జరుగుతున్న పనులు ఏంటని ఆయన అడిగి తెలుసుకున్నారు. అక్కడ వున్న గుట్టపైకెక్కి ఆ ప్రాంతమంతా కలియ తిరిగారు పవన్.
ఇకపోతే.. శుక్రవారం రాత్రి విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ సమావేశమైన సంగతి తెలిసిందే. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా పరిణామాలు, ఇక్కడ చోటు చేసుకుంటున్న దారుణాలను పవన్ కళ్యాణ్ ప్రధానికి నివేదించారు. ఆయన ఇవన్నీ సావధానంగా వింటూనే..ఇంకా ఇంకా అని అడుగుతూనే మధ్యలో ఆయన ‘ఐ నో ఎవ్రీథింగ్’, ‘ఐ నో ఇట్ ఆల్సో’ అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ALso Read:ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలు... పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన దాడుల నుంచి తాజాగా ఇప్పటంలో కక్షపూరిత రాజకీయాలను వరకు అనేక అంశాలను పవన్ కళ్యాణ్ క్లుప్తంగా ప్రధానికి వివరించారు. రామతీర్థం ఆలయం, అంతర్వేది రథం దగ్ధం నాటి పరిస్థితులను నివేదించారు. విశాఖలో పవన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను కూడా వివరించగా మోడీ తనకు అన్నీ తెలుసునని చెప్పారు. భూముల ఆక్రమణ వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్రం వాటిని సద్వినియోగం చేయడం లేదని, పైగా వాటిని ఇతర అవసరాలకు ఇస్తోందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తున్నా.. ఎక్కడా ఆ ప్రస్తావన ఉండడం లేదని తాము పేదల ఇళ్లపై ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నామని కూడా తెలియజేశారు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే అనైతికంగా వ్యవహరిస్తున్న తీరునూ ప్రస్తావించారు.