జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురువారం అమరావతికి రానున్నారు. రేపు ఉదయం 9గంటలకు పవన్ గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరుకోనున్నారు. అక్కడి నుంచి పటమటలంకలోని తన నివాసానికి చేరుకుంటున్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి మంగళగిరి జనసేన కార్యాలయంలో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో పవన్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
 ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పవన్ పిలుపునిచ్చారు. సమీక్షలో ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల గురించి నేతలతో పవన్ చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం పవన్ ప్రెస్‌మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఎన్నికల తర్వతా తొలిసారిగా పవన్ ఈ ప్రెస్ మీట్ లో స్పందించనున్నారు.