పశ్చిమగోదావరి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. మెుదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే 625 పైచిలుకులు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కంటే ముందు వరుసలో ఉన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గాజు వాక నియోజకవర్గంలో ముందుంజలో ఉన్నారు. భీమవరం నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల మధ్య హోరా హోరి పోరు నడిచింది. 

పోటీ కూడా ఇరు పార్టీల మధ్యే నిలవగా టీడీపీ మూడో స్థానానికి పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన మధ్య రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.