రైతుల ఇబ్బందులపై ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు పెట్టుబడి ఇస్తామన్న హామీ ఏమైందని ఆయన నిలదీశారు. అన్నం పెట్టే రైతులను కూడా కులాల వారీగా విడగొట్టారని పవన్ ఫైరయ్యారు.
రైతు సమస్యలపై ఏపీ ప్రభుత్వాన్ని (ap govt) ప్రశ్నించారు జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan). అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతుల్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు పెట్టుబడి ఇస్తామన్న హామీ ఏమైందని పవన్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎన్ని రైతు కుటుంబాలకు రూ.50 చొప్పున పంట పెట్టుబడి ఇచ్చారని క్వశ్చన్ చేశారు పవన్. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట డబ్బులు సకాలంలో చెల్లించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
పంటకు పెట్టుబడి లేదు.. రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకోరు.. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించరు, పండిన పంటను తీసుకుని కూడా డబ్బులు ఇవ్వరని పవన్ ఫైరయ్యారు. ఏ దశలోనూ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడటం లేదని ఆయన మండిపడ్డారు. అన్నం పెట్టే రైతులను కూడా కులాల వారీగా విభజించడమే ప్రభుత్వం చేసిన పనంటూ ఆయన ఆరోపించారు.
రైతుల గురించి మాట్లాడతాం కానీ .. రైతులా నటించడం గురించి మాట్లాడటం వృథా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి (kakani govardhan reddy). తెలుగు దేశం (telugu desam party) సానుభూతి పరుల గురించి మాట్లాడటం వేస్ట్ అన్నారు కాకాణి. సీఎం జగన్ హయాంలో ఏపీ రైతులు హ్యాపీగా వున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇకపోతే.. కోర్టులో చోరీ కేసు ఘటనపై సీబీఐ విచారణకు కూడా తాను సిద్దమేనని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. జ్యూడిసీయల్ విచారణకు కూడా తాను సిద్దంగానే ఉన్నానని ప్రకటించారు. కోర్టులో చోరీ ఘటన వెనుక ఏవో దురుద్దేశాలున్నాయన్నారు. ఈ విషయమై TDP నేతలు కోర్టుకు వెళ్లవచ్చన్నారు. 2017లో తనపై మాజీ మంత్రి Somireddy Chandramohan Reddy కేసు దాఖలు చేశారన్నారు. 2019 వరకు పోలీసులు చార్జీషీట్లు దాఖలు చేశారన్నారు.
కానీ ప్రాథమిక ఆధారాలు లేనందున ఈ కేసును విచారణకు స్వీకరించలేమని కోర్టు అప్పట్లోనే చెప్పిందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. Charge sheet ను మూడు సార్లు రిటర్న్ చేసిందన్నారు. 2019లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చార్జీషీట్ దాఖలైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ కేసును అసలు తాను పట్టించుకోవడం లేదన్నారు. కోర్టులో చోరీని తానే చేయించి ఉంటే ఆధారాలను తాను అక్కడే వదిలివెళ్లేలా చేస్తానా అని ప్రశ్నించారు. తాను మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఈ ఘటన జరగడం వెనుక తనకు కూడా అనుమానాలున్నాయన్నారు. తనకు మంత్రి పదవి రాదని కొందరు ప్రచారం చేశారని ఆయన చెప్పారు.
