Asianet News TeluguAsianet News Telugu

ఒక్క ఛాన్సివ్వండి, సీమలో క్యాంప్ ఆఫీస్ పెడతా: అనంతలో పవన్ సంచలన వ్యాఖ్యలు

జనసేనకు అధికారం ఇస్తే... రాయలసీమలో క్యాంప్ ఆఫీస్ పెడతామని హామీ ఇచ్చారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. రాయలసీమ నుంచి ఇంత మంది సీఎంలుగా పనిచేసినా ఇక్కడ పరిస్ధితులు మాత్రం మారలేదని ఆయన ఎద్దేవా చేశారు. 

janasena chief pawan kalyan sensational comments on 2024 elections
Author
Anantapur, First Published Oct 2, 2021, 9:30 PM IST

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ తమకు శత్రువు కాదని... వారు మంచిగా పాలన చేస్తే రోడ్లపైకి రావాల్సిన అవసరం మాకు లేదని పవన్ అన్నారు. రోడ్లపై 4 అడుగులకు ఒక గుంత వుందని... తాను వస్తున్నానని కొత్తచెరువులో 5 రోజుల్లో రోడ్డు వేశారని ఆయన ఎద్దేవా చేశారు. రెడ్లపై తనకు కోపం లేదని.. తనకు రెడ్లే గురువులని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. రెడ్లతో తనకు మంచి సంబంధాలున్నాయన్నారు.

Badvel bypoll: బద్వేల్ ఉపఎన్నిక బరి నుంచి జనసేన ఔట్.. పవన్ కీలక ప్రకటన, కారణమిదే

ఉన్న ఒక్క కియా పరిశ్రమను కూడా భయపెడితే.. పరిశ్రమలు ఎలా వస్తాయని పవన్ ప్రశ్నించారు. కియా పరిశ్రమ నిర్వాహకులను డబ్బు కోసం బెదిరించారని ఆయన ఆరోపించారు. అప్పటి నుంచి ఒక్క ఐటీ పరిశ్రమ కూడా ఏపీకి రాలేదని.. రాయలసీమలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో జనసేన చూపిస్తుందని పవన్ చెప్పారు. నాయకుడు నిజాయితీగా వుంటే.. పాలన నిజాయితీగా వుంటుందని ఆయన పేర్కొన్నారు. తనకు అవకాశం ఇస్తే.. మీ కష్టాల్లో తోడుగా వుంటానని పవన్ హామీ ఇచ్చారు. జనసేనకు అధికారం ఇస్తే... రాయలసీమలో క్యాంప్ ఆఫీస్ పెడతామని ఆయన అన్నారు. రాయలసీమ నుంచి ఇంత మంది సీఎంలుగా పనిచేసినా ఇక్కడ పరిస్ధితులు మాత్రం మారలేదని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios