అప్పు రత్న: అప్పులపై ఏపీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సెటైర్లు

 భారతరత్న మాదిరిగా  అప్పుల రత్న  అవార్డును  జగన్ కు ఇవ్వాలని  పవన్ కళ్యాణ్  సెటైర్లు  వేశారు.  ఏపీ ప్రభుత్వం  చేసిన అప్పులపై  పవన్ కళ్యాణ్  విమర్శలు  చేశారు.  
 

Janasena  Chief  Pawan Kalyan  Satirical  Comments  on  AP CM YS Jagan

అమరావతి: అప్పులతో  ఆంధ్రప్రదేశ్  పేరు ను మారుస్తున్నారని  ఏపీ సీఎం వైఎస్ జగన్  పై  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  విమర్శలు చేశారు.  మీ వ్యక్తిగత  సంపదను  పెంచుకోవడం మర్చిపోవద్దని  జగన్ నుద్దేశించి  పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు.  ఏపీ సంపద, ప్రగతిని కుక్కలకు వెళ్లనివ్వకండి  కానీ మీ వ్యక్తిగత సంపదనను పెంచుకోవడం మర్చిపోవద్దని  పవన్ కళ్యాణ్  విమర్శించారు. మీ వ్యక్తిగత  సంపద, ఆస్తులు , ఎప్పటికీ  అది ఆత్మే అంటూ  వ్యాఖ్యలు చేశారు.

 భారతరత్న మాదిరిగానే  అప్పు రత్న  అవార్డును  సీఎం జగన్ కు ఇస్తున్నట్టుగా  ఓ కార్టూన్  ను   తన ట్విట్టర్  హ్యండిల్ లో  పవన్ కళ్యాణ్  పోస్టు  చేశారు.   తొమ్మిది మాసాల్లో  జగన్ సర్కార్  55,555 కోట్లు అప్పులు  చేసిందని   ఈ పోస్టులో  జనసేనాని  విమర్శలు  చేశారు. 

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  చేసిన అప్పుల గురించి  కేంద్ర ప్రభుత్వం  ఇటీవల ప్రకటించింది.  2022 డిసెంబర్  మాసంలో  పార్లమెంట్  సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం  ఈ విషయమై  సమాధానం ఇచ్చింది.  2018లో ఏపీ ప్రభుత్వం అప్పులు  2,29,333.8 కోట్లు ఉండేది. అయితే  2022 నాటికి 3,60,333.4 కోట్లకు చేరిందని  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  2017-18లో  అప్పలు శాతం  9.8 శాతంగా  ఉండేది. కానీ  2020-21 నాటికి ఈ అప్పు  ల శాతం  17.1 శాతానికి  చేరిందని  కేంద్రం  వివరించింది .

స్థూల జాతీయ ఉత్పత్తిలో  2014లో  అప్పుల శాతం  42.3 శాతంగా  ఉంది.  2021 నాటికి  జాతీయ స్థూల ఉత్పత్తిలో  అప్పులు  36.5 శాతంగా  ఉన్నాయని  ఎంపీలు  అడిగిన ప్రశ్నలకు  కేంద్రం  తెలిపింది.అప్పుల విషయంలో  ఏపీలో  అధికార, విపక్ష సభ్యుల మధ్య  చాలా కాలంగా  విమర్శలు సాగుతున్నాయి.  టీడీపీ ప్రభుత్వం  కూడ అప్పలు చేసిందని  వైసీపీ  చెబుతుంది.  వైసీపీ  చేసిన స్థాయిలో  తాము అప్పులు చేయలేదని  టీడీపీ నేతలు  వివరిస్తున్నారు. ఈ తరుణంలో  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  ట్విట్టర్ వేదికగా  ఈ విమర్శలు  చేయడంతో  మరోసారి ఈ విషయమై  అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగే  అవకాశం లేకపోలేదు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios