Asianet News TeluguAsianet News Telugu

కడియం పరిషత్ ‌ఎన్నిక సజావుగా జరపండి.. తేడా వస్తే నేనే తేల్చుకుంటా: పవన్ కల్యాణ్

కడియం పరిషత్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన తరపున గెలిచిన అభ్యర్ధులను భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. తమ వాళ్లకు అన్యాయం జరిగితే తానే వెళ్లి తేల్చుకుంటానని జనసేనాని హెచ్చరించారు.

janasena chief pawan kalyan comments on kadiyam mpp election
Author
Hyderabad, First Published Sep 21, 2021, 10:14 PM IST

కడియం పరిషత్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన తరపున గెలిచిన అభ్యర్ధులను భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు సైతం ఒత్తిడి తీసుకొస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. తమ వాళ్లకు అన్యాయం జరిగితే తానే వెళ్లి తేల్చుకుంటానని జనసేనాని హెచ్చరించారు. జనసేన అభ్యర్ధులు గెలిచారన్న అక్కసుతో దాడులకు పాల్పడుతున్నారని పవన్ ఆరోపించారు. అధికార పార్టీ దౌర్జన్యాలు కొనసాగితే.. కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామని ఆయన హెచ్చరించారు. 

కాగా, ఏపీలో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం అర్ధరాత్రి వరకు జరిగింది. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 7,219 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిల్లో 5998 చోట్ల వైసీపీ, 826 చోట్ల టీడీపీ, 177 చోట్ల జనసేన, 28 చోట్ల బీజేపీ, 15 చోట్ల సీపీఎం, 8 చోట్ల సీపీఐ, 157 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 515 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా 502 చోట్ల వైసీపీ, 6 చోట్ల టీడీపీ, 2 చోట్ల జనసేన, సీపీఎం, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు గెలుపొందారు. 

Follow Us:
Download App:
  • android
  • ios