Asianet News TeluguAsianet News Telugu

ఆ పార్టీ నాపై ఒత్తిడి తెస్తోంది, ఒకేసారి మీద పడకండి ... జనసేన అధినేత పవన్

ఎవరు ఎంత ఒత్తిడి చేసినా.. తమ జనసేన పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేయనని ప్రకటించారు. జాతి సమగ్రతను కాపాడటానికి, మానవతా విలువల కోసం పెట్టిన పార్టీ జనసేన అని అందుకే  జనసేనను ఏ పార్టీలోనూ కలపమని స్పష్టం చేశారు.

janasena chief pawan kalyan comments in his party meeting
Author
Hyderabad, First Published Aug 16, 2019, 3:29 PM IST

జనసేన పార్టీని తమ పార్టీలో కలిపేయాలంటూ ఓ పెద్ద పార్టీ తనపై ఒత్తిడి తీసుకువస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన బరిలో నిలవగా... కేవలం ఓకే ఒక్క ఎమ్మెల్యే విజయం సాధించాడు. కనీసం పార్టీ అధినేత పవన్ కూడా గెలవలేదు. కాగా... తమ పార్టీని ఓ పెద్ద పార్టీలో విలీనం చేసుకోవాలని అనుకుంటోందని తాజాగా పవన్ ఆరోపిస్తున్నారు.

శుక్రవారం విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు ఎంత ఒత్తిడి చేసినా.. తమ జనసేన పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేయనని ప్రకటించారు. జాతి సమగ్రతను కాపాడటానికి, మానవతా విలువల కోసం పెట్టిన పార్టీ జనసేన అని అందుకే  జనసేనను ఏ పార్టీలోనూ కలపమని స్పష్టం చేశారు.

తాను సత్యం కోసం పనిచేసేవాడినని, ఎవరికైనా అభిప్రాయాలు ఉంటే చెప్పాలని కోరారు. అలా కాకుండా రోడ్ మీదకు వెళ్లి, సోషల్ మీడియాలో చెప్తే వినటానికి ఇదేం కాంగ్రెస్ పార్టీ కాదని నేతలు, కార్యకర్తలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘నా బలం నాకు తెలుసు.. నా బలహీనత నాకు తెలుసు..’’ అని పేర్కొన్నారు. జనసైనికులు అంతా వరదబాధితులకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో అభిమానుల అత్యుత్సాహంపై స్పందించిన పవన్.. ‘‘మీతో కలిసి ఫోటోలు దిగటానికి ఇబ్బందేమీ లేదు. అయితే ఒకేసారి అందరూ మీద పడిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతోంది’’ అని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios