అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలో సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం కావాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు బెజవాడ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ.. జనసేనకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని, అలాగే ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు సైతం రాబోయే రోజుల్లో జనసేనలో చేరుతారని, పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.