హైదరాబాద్: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రెక్టార్‌గా పనిచేస్తున్న ప్రోఫెసర్ జానకీ రామయ్య  గురువారం  మధ్యాహ్నం రాజీనామా చేశారు.జానకీ రామయ్య ప్రైవేట్ బీఈడీ కాలేజీల నుండి  డబ్బులు వసూలు చేసినట్టుగా  జానకీ రామయ్య పై విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేశారు.

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో రెక్టారుగా పనిచేస్తున్న జానకీ రామయ్య ప్రైవేట్ బీఈడీ కాలేజీల యాజమాన్యాలతో డబ్బుల విషయమై మాట్లాడినట్టుగా ఫోన్ సంభాషణను  విద్యార్థి సంఘాలు బయట పెట్టాయి.

ఈ విషయమై వీసీకి కూడ ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొంది. విచారణ సాగుతున్న సమయంలోనే రెక్టార్ పదవికి జానకీరామయ్య రాజీనామా చేశారునూతన రెక్టార్‌గా ఎస్వీయూ జంతుశాస్త్ర విభాగం ప్రోఫెసర్ ఆచార్యులు ఎం. భాస్కర్‌ను నియమించారు.

సంబంధిత వార్తలు

చిక్కుల్లో ఎస్వీ యూనివర్శిటీ రెక్టార్: విద్యార్థుల ఆందోళన