గుడిలో లింగాన్ని దోచే దొంగవిరా నువ్వు.. మాజీ మంత్రి వెల్లంపల్లిపై జనసేన నేత ఫైర్
Visakhapatnam: విశాఖపట్నంలోని వారాహి యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పై మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. సీఎం జగన్ ను పవన్ కళ్యాణ్ ఏమీ పీకలేరనీ, ఇష్టమోచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రిపై జనసేన నాయకుడు పొతిన వెంకట మహేష్ ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు.
Jana Sena leader Potina Venkata Mahesh: విశాఖపట్నంలోని వారాహి యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పై మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. సీఎం జగన్ ను పవన్ కళ్యాణ్ ఏమీ పీకలేరనీ, ఇష్టమోచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రిపై జనసేన నాయకుడు పొతిన వెంకట మహేష్ ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు.
వివరాల్లోకెళ్తే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వారాహి యాత్రలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ విమర్శలు గుప్పించడంపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పవన్ ను ‘రా’ అంటూ సంబోధించిన మాజీ మంత్రిపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన నేత పోతిన వెంకట మహేష్ మాజీ మంత్రి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన పోతిన వెంకట మహేష్.. ‘‘పవన్ కళ్యాణ్‌ను ఏరా అంటావారా వెల్లంపల్లి. వెధవ.. గుడిలో లింగాన్ని దోచే దొంగవిరా నువ్వు అంటూ ఫైర్ అయ్యారు. జనసేన అధినేత పవన్ ను ఏకవచనంతో సంబోధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయనీ, అలాగే మరోసారి మాట్లాడితే మాట్లాడితే తాట తీస్తామంటూ హెచ్చరించారు.
మాజీ మంత్రి అవినీతి, అక్రమాలు చేశారని ఆరోపించిన జనసేన నేత పొతిన.. మరో రెండు రోజుల్లో వెల్లంపల్లి అక్రమాల చిట్టాను బయటపెడతామని అన్నారు. ఇదే క్రమంలోనే మంత్రి రోజాపై కూడి విమర్శలు గుప్పించారు. ఆమె ఇవే చివరి ఎన్నికలు అంటూ పేర్కొన్నారు. టీవీల్లో యజబర్దస్త్ చేసుకొంటూ బెంజ్ కార్లో రోజా తిరిగితే బాగుంటుందని అన్నారు. సీఎం జగన్ ను లాగుతూ.. జగన్ ఆస్తులపై చర్చకు వచ్చే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. మద్యంలో కొట్టేసిన రూ.30 వేల కోట్లతో వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు. జనసేన కనిపించకుండా పోతుందంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వచ్చే ఎన్నికలో కనిపించకుండా పోయేది జనసేన కాదు వైసీసీ అంటూ మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడుతూ.. గుండు కొట్టించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉండాలనీ, దానికి అయ్యే ఖర్చులు తామే పెట్టుకుంటామంటూ సెటైర్లు వేశారు.