గూడ గ్రామంలో జరుగుతున్న అక్రమ క్వారీ వ్యవహరాలపై టీడీపీ ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఆ ఇద్దరు నేతలు ప్రాణాలు పోగొట్టుకుని ఉండేవారు కాదని జనసేన అభిప్రాయపడింది.

అమరావతి: అరకు శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యపై పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వారి మృతికి సంతాపం తెలియజేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 

గూడ గ్రామంలో జరుగుతున్న అక్రమ క్వారీ వ్యవహరాలపై టీడీపీ ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఆ ఇద్దరు నేతలు ప్రాణాలు పోగొట్టుకుని ఉండేవారు కాదని జనసేన అభిప్రాయపడింది. తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు గూడ గ్రామస్థులతో సమావేశమైన విషయాన్ని పార్టీ గుర్తు చేసింది.

పార్టీ నాయకులు. అక్రమ క్వారీలతో అక్కడి ప్రజలు పడుతున్న అవస్థలను దగ్గరనుంచి చూసిన విషయాన్ని గుర్తు చేశారని ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరితోనే సర్వేశ్వరరావు, సోమ ప్రాణాలు పోగొట్టుకొన్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్‌) పేర్కొంది. వారి మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది.