ఇప్పటం బాధితులకు రూ.లక్ష ఆర్ధిక సహాయం: పవన్ కళ్యాణ్ నిర్ణయం

మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన వారికి లక్ష రూపాయాఆర్ధిక  సహాయం  అందించాలని జనసేన నిర్ణయం తీసుకుంది.త్వరలోనే పవన్ కళ్యాణ్ ఈ గ్రామంలో పర్యటించి లక్ష రూపాయాలను ఆర్ధిక సహాయంగా అందించనున్నారు.

Jana Sena Chief Pawan Kalyan decides to give Rs .1 Lakh For Ippatam Victims

అమరావతి: మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ఇళ్లు దెబ్బతిన్నవారికి రూ.1లక్ష చొప్పున ఆర్ధిక సహాయం చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది మార్చి 14న ఇప్పటం శివారులో  జనసేన ఆవిర్భావ సభకు గ్రామస్తులు సహకరించారని జనసేన గుర్తు చేసింది.దీంతో ఇటీవల ఇప్పటంలో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేశారని జనసేన ఆరోపించింది.ఇప్పటంలో కూల్చివేసిన ఇళ్లను పవన్ కళ్యాణ్ ఈనెల 05న పరిశీలించారు.బాధితులను ఓదార్చారు. పేదలను ఇళ్లను కూల్చివేసినట్టుగానే వైసీపీ  ప్రభుేత్వం కూల్చివేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు విడతలవారీగా సహయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా జనసేన పొలిటికల్ ఎఫైర్స్  కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.బాధితులకు పవన్ కళ్యాణ్ స్వయంగా  వెళ్లి పరిహరం అందిస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. 

ఇప్పటంలో మొత్తం 4,120 మంది జనాభా నివాసం ఉంటారు.రోడ్ల విస్తరణ పేరుతో గ్రామంలో ఇళ్ల కూల్చివేత రాజకీయంగా రచ్చకు కారణమైంది.జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామస్థులు సహకరించారనే నెపంతో ఇళ్లను కూల్చివేశారని విపక్షాలు ఆరోపించాయి.అయితే ఈ ఆరోపణలను వైసీపీ,ప్రభుత్వఅధికారులు ఖండిస్తున్నారు. ప్రభుత్వభూమిని ఆక్రమించుకుని  నిర్మంచిన వాటినే తొలగించినట్టుగా అధికారులు వివరించారు.  కాంపౌండ్ వాల్స్, మరుగుదొడ్ల వంటి నిర్మాణాలను మాత్రమే కూల్చివేసినట్టుగా అధికారులు  తెలిపారు. సుమారు 52  ఇళ్లలో నిర్మాణాలు ధ్వంసం చేశారు.రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించాలని  నోటీసులు  ఇచ్చినట్టుగా అధికారులు గుర్తు చేస్తున్నారు.

alsoread:ఇప్పటంలో కూల్చివేతలు ఇప్పటిది కాదు... జనవరి నుంచే ప్రొసీజర్, పవన్‌కు తెలుసా : మంత్రి రాంబాబు

ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత విషయమై వైసీపీ సర్కార్ పై జనసేన,టీడీపీ, బీజేపీలు విమర్శలు గుప్పించాయి.విపక్షాలపై అదే స్థాయిలో వైసీపీ కూడ ఎదురు దాడికి దిగింది.రోడ్ల విస్తరణ కోసం అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టుగా వైసీపీ వివరించింది.రాజకీయ లబ్ది కోసం విపక్షాలు  ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని  వైసీపీ విమర్శలు చేసింది.

ఈ ఏడాది ఆరంభం నుండే రోడ్ల విస్తరణకు సంబంధించి అధికారులు పనులు ప్రారంభించారని వైసీపీ గుర్తు చేస్తుంది.ఈ విషయాలు పవన్ కళ్యాణ్ తెలుసా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. రోడ్ల విస్తరణను  కూడ రాజకీయంగా లబ్దిపొందేందుకు ఉపయోగించుకోవడాన్నిమరో మంత్రి జోగి రమేష్ తప్పుబట్టారు.ఈ ఏడాది ఆరంభం నుండే రోడ్ల విస్తరణకు సంబంధించి అధికారులు పనులు ప్రారంభించారని వైసీపీ గుర్తు చేస్తుంది.ఈ విషయాలు పవన్ కళ్యాణ్ తెలుసా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. రోడ్ల విస్తరణను  కూడ రాజకీయంగా లబ్దిపొందేందుకు ఉపయోగించుకోవడాన్నిమరో మంత్రి జోగి రమేష్ తప్పుబట్టారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios