తూర్పగోదావరి జిల్లాలోని రోడ్ల దుస్థితిపై ఎవ‌రో అజ్ఞాత వ్య‌క్తి కొత్త‌గా నిర‌స‌న తెలిపాడు. జ‌గ‌న‌న్న ఉన్నాడు జాగ్ర‌త్త అంటూ ఎవరో రోడ్డుపై పెట్టిన పోస్టు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

నిర‌స‌నలు ఎన్నో ర‌కాలు.. ఏ రకంగానైనా మ‌నం నిర‌స‌న తెలియజేయ‌వ‌చ్చు. నిర‌న‌స తెలియ‌జేయ‌డం ప్ర‌జాస్వామిక హ‌క్కు. శాంతియుతంగా ఎవ‌రికీ ఇబ్బంది క‌ల‌గ‌కుండా నిర‌స‌న ప్ర‌భుత్వానికి తెలియ‌జేయ‌డంలో ఎలాంటి త‌ప్పు లేదు. అయితే ఇప్పుడు ఈ విష‌యం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వ‌స్తోంది అంటే ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లాలో ఒక‌రు విచిత్రంగా నిర‌స‌న తెలియ‌జేశారు. వారి ప్రాంతంలో నెల‌కొన్న ప‌రిస్థితిని ప్ర‌పంచానికి తెలిసేలా చేశారు. 

https://telugu.asianetnews.com/andhra-pradesh/good-news-for-ap-employees-today-ycp-government-gives-clarity-on-prc-r41w9f

ఏంటి ఆ విచిత్ర నిర‌స‌న ?
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గోదావ‌రి జిల్లాలో రోడ్లు దారుణంగా త‌యార‌య్యాయి. దీంతో ఆ రోడ్డుపై ప్ర‌యాణించే వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. చాలా గుంతలు ఏర్ప‌డ‌టంతో ప్ర‌యాణికులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఈ విష‌యంలో వారు ప్రభుత్వానికి ఎన్నో సార్లు విన‌తిప‌త్రం ఇచ్చారో లేదో తెలియ‌దు గానీ.. ఈ రోడ్డు ప‌రిస్థితి మాత్రం ఒకే సారి సోష‌ల్ మీడియా ద్వారా ఎంతో మందికి తెలిసింది. ఏపీ ప్ర‌భుత్వానికి, సీఎంకు ఈ రోడ్డు దుస్థితి తెలిసేలా.. ఈ స‌మ‌స్య‌పై అంద‌రి దృష్టి ప‌డేలా ఎవ‌రో కొత్తగా ఆలోచించి ఫ్లెక్సీ పెట్టారు. అది మామూలు ఫ్లెక్సీ కాదు ఏపీ సీఎం జ‌గ‌న్ మాటాలు స్పురించేలా త‌యారు చేయ‌బ‌డిన ఫ్లెక్సీ. ‘ఇందులో జగనన్న ఉన్నాడు జాగ్రత్త.. ఈ బోర్డు రోడ్డు వేసేంత వరకు ఎవ‌రైనా తొల‌గించిన‌చో వారి వారి కుటుంబాలు ఈ రోడ్డుపైనే పోతారు’ రాసి ఉంది. గుంత‌లు ప‌డి ఉన్న రోడ్డుపై మ‌ధ్య‌లో ఈ బోర్డును ఏర్పాటు చేశారు. దీంతో అటుగా వెళ్లే ప్ర‌యాణికులు దృష్టి మొత్తం దీనిపై ప‌డుతోంది. కుటుంబానికి ఏమైనా అవుతుందేమో అని సెంటిమెంట్‌తో దానిని ఎవ‌రూ తీసేందుకు ముందుకు రావ‌డం లేదు. అయితే ఈ ఫ్లెక్సీ, రోడ్డు ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. అయితే ఫ్లెక్సీపైన రాసిన ‘జ‌గ‌న‌న్న ఉన్నాడు’ అనే మాట‌.. ప్రస్తుత సీఎం జ‌గ‌న్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు బాగా ఉప‌యోప‌డ్డాయి. ఆ మాట‌లు ప్ర‌జ‌ల్లోకి బాగా చొచ్చుకెళ్లాయి. అయితే ఆ మాట‌ల‌ను ఇప్పుడు సీఎంపైనే సెటైర్స్ వేయ‌డానికి ఉప‌యోగిస్తున్నారు. ఆ ఫ్లెక్సీపై ఏపీ సీఎం జ‌గ‌న్ ఫొటో పెట్టి మ‌రీ ఆ వ్యాఖ్యాలు రాశారు. గ‌తంలో విశాఖ‌ప‌ట్ల్నంలోనూ ఇలాగే ప‌లువురు నిర‌స‌న తెలిపారు. అయితే సాధార‌ణంగా రోడ్ల ప‌రిస్థితిపై నిర‌స‌న తెలిపే వారు బుర‌ద రోడ్ల‌పై వ‌రి నాట్లు వేయ‌డం, మొక్క‌లు నాట‌డం, ఆ గుంత‌ల వ‌ద్ద ఫొటో షూట్ చేయ‌డం వంటి ప‌నులు చేశారు. ఇలా చేసి ప్ర‌భుత్వానికి నిర‌స‌న తెలిపే వారు. అయితే ఇలా ఫ్లెక్సీ పెట్టి మ‌రీ త‌మ అసంతృప్తి తెల‌ప‌డం చాలా అరుదుగా జ‌రుగుతుంటాయి. మ‌రి ఏపీ ప్ర‌భుత్వం దీనిని పాజిటివ్‌గా తీసుకొని రోడ్డు బాగుచేయిస్తోందో లేదో తెలియాలంటే ఎదురుచూడాల్సి ఉంది.