అమరావతి: ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత  జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఈ నెల 30వ తేదీన ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు.

జగన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడ హాజరుకానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 29వ తేదీనే విజయవాడకు చేరుకొంటారు. ఆ రోజు అక్కడే ఉంటారు. మరునాడు ఉదయమే కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొంటారు. ఆ తర్వాత జగన్ ప్రమాణస్వీకారోత్సవంలో కేసీఆర్ పాల్గొంటారు.

జగన్ ప్రమాణ స్వీకారోత్సవం పూర్తైన వెంటనే కేసీఆర్, జగన్‌లు ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.  రెండో దఫా మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో జగన్, కేసీఆర్‌లు పాల్గొంటారని సమాచారం.