జనంలోకి జగన్: మే నుండి జిల్లాల పర్యటనకు ఏపీ సీఎం ప్లాన్


ఈ ఏడాది మే మాసం నుండి ప్రజల్లోకి వెళ్లాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు.  ఈ విషయమై మంత్రివర్గంలో సీఎం జగన్ మంత్రులతో చర్చించారు. సోమవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయమై జగన్ చర్చించారు.

Jagan to tour all districts from May

అమరావతి: ఈ ఏడాది మే మాసం నుండి ప్రజల్లోకి వెళ్లాలని ఏపీ సీఎం YS Jagan భావిస్తున్నారు. ఈ విషయమై సీఎం జగన్ మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే విషయమై కూడా సీఎం జగన్ ప్లాన్ చేయనున్నారు.
మంత్రులు కనీసం వారానికి మూడు రోజుల పాటు పార్టీ కోసం సమయాన్ని కేటాయించాలని సీఎం జగన్ సూచించారు. 

సోమవారం నాడు AP Assembly వాయిదా పడిన తర్వాత AP Cabinet సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రులతో సీఎం జగన్ చర్చించారు. ఏపీ రాష్ట్రంలో  రానున్న రెండేళ్లలో ఏ కార్యక్రమాలను చేపట్టాలనే విషయమై  కూడా మంత్రులతో చర్చించారు. 2024లో ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే అసెంబ్లీకి Election జరిగే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. అధికార పార్టీ నేతలు మాత్రం షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారు. 

ఈ తరుణంలో మంత్రివర్గ సమావేశంలో  సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లాలని వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై శాసనసభపక్షం ఏర్పాటు చేసి దిశా నిర్ధేశం చేస్తానని సీఎం జగన్ తెలిపారు.  ఈ ఏడాది July లో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించుకొందామన్నారు.  అభివృద్ది పనులు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయని కొందరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గానికి రెండు కోట్లు ఇవ్వనున్నామని సీఎం జగన్ చెప్పారు. దీంతో అభివృద్ది పనులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ ఏడాది జూలై 8న పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నారు. మరోవైపు ఈ నెల 10న YCP శాసనసభపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనన్నారు.

ఇదిలా ఉంటే ఎన్నికల కోసం సీఎం జగన్  మంత్రివర్గంలో మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో పనితీరు ఆధారంగా మంత్రులను జగన్ కొనసాగించనున్నారు. ప్రకస్తుతం ఉన్న వారిలో పనితీరు సరిగా లేనివారిని మార్చనున్నారు. ఎన్నికల కోసం టీమ్ ను జగన్ సిద్దం చేసుకొంటారనే చర్చ సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాటి నుండి రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా వైసీపీ మంచి విజయాలను నమోదు చేసింది. వైసీపీ చేతిలో టీడీపీ పరాజయం పాలైంది. మరోవైపు బీజేపీ, జనసేన కూటమి కూడా ఆయా ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో  క్షేత్రస్థాయిలో తమ పట్టును మరింత బిగించాలని జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు  పార్టీని వచ్చే ఎన్నికలకు సిద్దం చేసేందుకు ఇప్పటి నుండే ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ మేరకు మే మాసం నుండి జనంలోకి వెళ్లాలని భావిస్తున్నారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరి మరణించారు. అయితే ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు వీలుగా జగన్ ప్రజల వద్దకు వెళ్లాలని భావిస్తున్నారు. గతంలోనే పలుమార్లు జనంలోకి వెళ్లాలని ప్లాన్ చేసినప్పటికీ అనుకోని కారణాలతో  ఈ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అయితే ఈ ఏడాది మే మాసం నుండి జనంలోకి వెళ్లనున్నారు.

గత ఏడాది డిసెంబర్ మాసం నుండి జిల్లాల పర్యటన చేయాలని కూడా సీఎం జగన్ భావించారు. అంతకు ముందు కూడా ఇదే రకమైన ప్రణాళికలు చేసుకొన్నారు. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక రకమైన అడ్డంకులు రావడంతో జిల్లాల పర్యటనలను జగన్ వాయిదా వేసుకొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios