రైతు సంక్షేమమే ధ్యేయం: కౌలు రైతులకు పెట్టుబడి సహాయం విడుదల చేసిన జగన్

కౌలు రైతులకు  వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి  సహాయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ  విడుదల చేశారు.

Jagan  releases Rs 109.74 crore under YSR Rythu Bharosa to 1,46,324 tenant farmers lns

అమరావతి: కౌలు రైతులకు  వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద  పెట్టుబడి సహాయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్  శుక్రవారంనాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్చువల్ గా  లబ్దిదారులతో ఏపీ సీఎం జగన్ ప్రసంగించారు. ఇప్పటివరకు  కౌలు రైతులకు  మొత్తం రూ. 1,122 కోట్లు పంపిణీ చేసినట్టుగా  ఏపీ సీఎం జగన్ చెప్పారు.1,46,324 మంది కౌలు రైతులకు  రూ. 109.74 కోట్ల పెట్టుబడి సహాయం అందిస్తామని సీఎం తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా  కౌలు రైతులకు  తోడుగా  ఏపీ ప్రభుత్వం  పెట్టుబడి సహాయం అందిస్తున్న విషయాన్ని ఏపీ సీఎం జగన్ గుర్తు చేశారు.సీసీఆర్‌సీ కార్డులు పొంది కౌలు చేసుకుంటున్న రైతులకు తొలి విడత పెట్టుబడి సహాయం అందించినట్టుగా సీఎం చెప్పారు.వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 52 లక్షల 50వేల మంది రైతులకు మేలు కలుగుతుందని  సీఎం జగన్ వివరించారు.

ఏ సీజన్ లో  పంట నష్టం జరిగితే  అదే సీజన్ లో సహాయం చేస్తున్నామని  సీఎం జగన్ తెలిపారు. ఈ ఏడాది జూలై మాసంలో కురిసిన వర్షాలకు పంట నష్టానికి  సహాయం అందించిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. పంట పెట్టుబడికి రైతులు అప్పులు చేయాల్సిన అవసరం రాకుండా  ఈ పథకం  దోహదపడుతుందని  సీఎం చెప్పారు.

ఆర్‌బీకేల ద్వారా రైతులకు కల్తీలేని విత్తనాలను అందిస్తున్నామన్నారు.ఆర్‌బీకేల ద్వారా  ఈక్రాప్ డేటా నమోదు చేస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు.పంటల భీమా ద్వారా రైతులకు  అండగా ఉన్న విషయాన్ని సీఎం  గుర్తు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios